Adsense

Saturday, October 1, 2022

మహబూబ్ నగర్ జిల్లా : అలంపూర్ హేమలాంబ/రేణుకా ఎల్లమ్మ ఆలయం




💠 ఇది మరుగున పడ్డ మహా శక్తి క్షేత్రము.
పూర్వం అలంపురంలో ఉన్న రేణుకా దేవి శిరస్సును పరశురాముడు ఖండించిన సందర్భంలో ఆ తల్లి శిరస్సు ఇక్కడ పడి ఇలా ఉండి ఇప్పటికి పూజలు అందుకుంటూ ఉంది అంటారు.
యావత్ అలంపూర్ క్షేత్రానికి ఇది మధ్య స్థానం.

💠 ఈ అమ్మవారి పేరు హేమలాంబ/హెగులాంబ/హేమాంబ/హేమాంబిక గా శాసనాల్లో తెలియవస్తుంది ..
ఇదే పేరు మీదే అలంపురంకు హేమలాపురం అన్న పేరు వచ్చినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది.

💠 ఈ రేణుకా దేవి తన మహత్యాన్ని మరుగున పెట్టుకొని అలంపురం కు కీర్తిని ప్రసాదించింది అని చెబుతారు
అయితే కాలంలో వచ్చిన ఎన్నో మార్పుల్ని తట్టుకొని కూడా ఈ శాక్తేయ ఆలయం
ఇప్పటికి నిలచి ఉండడం దేవి మహత్యం


🔱    రేణుక ఎల్లమ్మ    🔱


💠 రేణుకాదేవి తన భర్త అయిన జమదగ్ని మహర్షి తో, కుమారులతో అలంపురం క్షేత్రంలో నవబ్రహ్మ ఆలయాలుకు పూజలు చేసేవారు .
ఆవిడ మహాపతివ్రతయే. అయినా భర్త కోపానికి గురయింది.
ఇసుకతో కుండను తయారు చేసి నీటికని వెళ్ళిన ఆమె స్నానంకు వచ్చిన కార్తిక రాజు రాణిల విలాసం  చూస్తూ ఉండినందుకు మనసు చెలించడం వల్ల ఇసుక కుండ తయారు కాక వట్టి చేతులతో వెళ్ళగా.  ఆలస్యంగా రావటంతో, కోపంతో జమదగ్ని ఋషీశ్వరుడు అపార్థం చేసుకొని, తల్లి శిరచ్ఛేదం చేయమని కొడుకులను ఆజ్ఞాపించినాడు.
కానీ వారిలో కొందరు తిరస్కరించడం వల్ల... పరశురాముడు మాత్రం పితృవాక్య పరిపాలనం గావించి తన తల్లిని వెంటాడి వేటాడి వస్త్రాలు పోయినా వదలకుండా తల నరికేశాడు .
మళ్ళీ వెంటనే తల్లిని బ్రతికించమని తండ్రిని వేడుకొన్నాడు.

💠 పరశురాముడు శిరచ్ఛేదం చేసినప్పుడామె తల వెళ్ళి చండాల వాటికలో పడినందున ఆమె గ్రామ దేవతయిందని అంటారు.
జమదగ్ని మహర్షి వరం మేరకు తల భాగాన్ని కొలిచిన వారికి కొంగుబంగారంగా అష్ట ఐశ్వర్యాలు సుఖ సంపదలు సిద్ధిస్తాయని మొండెం భాగం పడిన చోట సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగునని వరం ఇవ్వడం జరిగినది.
ఈ అలంపురం క్షేత్రంలో  నగ్నంగా ఉన్న మొండెం భాగమును భూదేవిగా రేణుక దేవి గా పిలువబడుతుంది.


💠 సంతానం లేని వాళ్ళు అమ్మవారి దగ్గరికి వచ్చి (ఆడవాళ్లు మాత్రమే ) వెన్నతో యోని భాగంకు పూజ చేయడం వల్ల సంతానం కలుగుతుందని నమ్మకం .
అమ్మవారి తల భాగం  దగ్గర్లోని 12 కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి గ్రామం దగ్గర పడినట్టుగా..  వివిధ గ్రామాల్లో కూడా రేణుక ఎల్లమ్మ తల భాగాలతో ఆలయాలు ఏర్పడ్డాయి .

💠 ప్రతి మంగళ శుక్రవారాలలో వారానికి రెండు రోజులు మాత్రమే రేణుక ఎల్లమ్మ పూజలు ఇక్కడ నిర్వహిస్తారు .
దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కానీ మిగతా రోజుల్లో గుడి ఉండదు.


💠 అలంపురం వెళ్లే వారు తప్పకుండా దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
ఈ తల్లి దర్శనం వల్ల స్త్రీలకు వచ్చే దీర్ఘకాలిక రోగాలు సమస్యలు తొలగి పూర్తి ఆరోగ్యం కలుగుతుంది .
తప్పకుండా దర్శించుకొని ఈ  క్షేత్ర ప్రచారానికి తోడ్పడగలరు


💠 ఈ దేవాలయం అలంపూర్ నుండి 9km దూరంలో ఉంది.

No comments: