Adsense

Monday, October 3, 2022

బతుకమ్మ పండుగ

 


బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. మమతల మాధుర్యాన్ని, మానసిక అనుబంధాల్ని, మళ్లీ మళ్లీ గుర్తుంచుకోవాలని చెప్పటమే బతుకమ్మ పండుగలోని అంతర్యం. ప్రతి ఆడపడుచు పెండై అత్తారింట్లో వున్నా ఈ పూట పండుగ పుట్టింట్లో జరుపుకోవాల్సిందే. బతుకమ్మ పండుగ పద్దెనిమిది కన్నె
పిల్లలు జరుపుకునే పండుగ. పుట్ట మన్ను తెచ్చి ఓ పీట పై అంతస్థులుగా గుండ్రంగా బొడ్డెమ్మను రూపొందిస్తారు. అలంకరించి ఆటలు ఆడి పాటలు పాడి వినోదించటమే కాదు, మంచి మొగుళ్లు రావాలనీ మరీమరీ వేడుకుంటారు. జనజీవన సంస్కృతి మాత్రమే కాదు అందుకు ఊపిరి ప్రకృతి ఆరాధన ముఖ్యమని చాటే పండుగే బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు.

బొడ్డెమ్మ అంటే “చిన్న అమ్మాయి” అని అర్థం. బతుకమ్మ చిన్ననాటి రూపాన్ని ఆరాధించడమే ఈ పండుగ ఆంతర్యం. ఈ పండుగ ప్రత్యేకత కోలాటం. కన్నెపిల్లలు పాటలు పాడుతూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ మురిసిపోతారు. ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఒకే సారి ఆస్వాదిస్తారు.

బతుకమ్మ కథ :

తెలంగాణ పల్లెసీమలో వెలసిన బతుకమ్మ ఓ అభాగ్యురాలు, త్యాగమయి, పేదింటి ఆడపడుచు. అగచాట్లకు బలైన అమాయకురాలు. ఒక విధంగా తెలంగాణ స్తీమూర్తికి ప్రతీక. ఈమె పుట్టుక గురించి పౌరాణిక కథ, జానపదుల నోళ్లలో నినదించేది. ఈ రెండు వివరించే సత్యమొక్కటే. స్త్రీ పూజనీయరాలు. ఆమె సంతోషమే సమాజానికి క్షేమం అని.

శ్రీగౌరి నీపూజ ఉయ్యాలో.. చేయబోతినమ్మ ఉయ్యాలో... శంకరా పార్వతీ ఉయ్యాలో.. శంబురాణినే ఉయ్యాలో వంటి పాటలు నీ మహిమలు చిత్రమై తోచునమ్మా వంటి పాటలు బతుకమ్మ గౌరిదేవి, లక్ష్మీదేవి అంశంగా జన్మించిన స్త్రీమూర్తి అనే భావన జానపదాల్లో వుందని, తెలుస్తుంది.

పూర్వం చోళ దేశాన్ని ధర్మాంగదుడనే రాజు పాలించేవాడు. ఆయన భార్య సత్యవతి. వీరికి చాలాకాలం సంతానం కలగకపోవడం వల్ల నూరు నోములు నోస్తారు. ఫలితంగా నూరుగురు పుత్రులు జన్మిస్తారు. రాజదంపతులు దుఃఖించి లక్ష్మీదేవిని ఆరాధించి ఆమెనే తమ ఇంట కూతురిగా జన్మించమని వేడుకుంటారు. లక్ష్మీదేవి వారి కోరిక మన్నించి వారి కూతురై జన్మిస్తుంది. ఆ సమయంలో అక్కడికి విచ్చేసిన మునులు ఆమెను కలకాలం బలకాలని 'బతుకమ్మ' అని దీవిస్తారు. నాటి నుంచి ఆమె పేరు బతుకమ్మ. మహావిష్ణువు చక్రాంకుడను పేరుతో రాజకుటుంబంలో జన్మించి యుక్తవయసులో బతుకమ్మను పెండ్లాలతాడు. నాటి నుంచి బతుకమ్మ లక్ష్మీదేవి అవతారంగా పూజలందుకుంటుంది.

జానపదకథ:

తెలంగాణ పల్లెసీమల్లో పాటల్లో కథల్లో కనిపించే బతుకమ్మ సాదాసీదా స్త్రీమూర్తి. ఓ పేదరైతు కుటుంబంలో ఏడో సంతానం అంతకుముందు ఆయన రైతు దంపతులు పిల్లలు పూట్టకపోవడం వల్ల బతుకమ్మకు నామకరణం చేయకుండా "బతుకమ్మ"  అని పిలుస్తారు.  ఈ ఆచారం నేటి వరకు ఉండేది. బతుకమ్మ యుక్తవయసులో పెండ్లయి అత్తారింటికి వెళ్తుంది. ఊరందరికి ఉపకారం చేస్తూ అందరి అభిమానం చూరగొంటుంది. అత్తా ఆడబిడ్డల ఆదరణ కూడా పొందుతుంది. భర్త ప్రేమగా చూసుకుంటాడు.

ఒకనాడు బతుకమ్మ పుట్టింటి మమకారంతో అన్న ఇంటికి వస్తుంది. వదినతో కలిసి చెరువుకు స్నానానికి వెళ్లారు. అక్కడ గట్టుపై తమ బట్టలు పెట్టి స్నానానంతరం వచ్చి గాలిధుమారం రానుండడంతో త్వరగా బట్టలు చుట్టుకుంటారు. అయితే ఆ తొందరలో బతుకమ్మ తన వదిన చీర కట్టుకుంటుంది. ఇది బతుకమ్మ గమనించలేదు. అయితే అప్పటికే బతుకమ్మపై వాళ్ల అన్నయ్య చూవుతున్న మమకారం, పెంచిన ప్రేమను చూడలేక వదిన క్రోధం, అనసూయతో కలిసి బతుకమ్మ అంతానికి దారితీసింది. ఆ వదిన బతుకమ్మ -గొంతు పిసికి హత్యచేసి ఆ గట్టున పాతిపెడుతుంది. ఇదంతా బతుకమ్మ అన్నకు తెలియకముందే. నాటి ర్యాత్రి బతుకమ్మ భర్తకు కలలో కసిపించి జరిగిన సంఘటన వివరించి, ఎవరినీ ద్వేషించకండి, తనను మాత్రం పూలబాలగా అలంకరించి ప్రతి ఏటా ఆశ్వీజమాసం అష్టమిరోజు ఆరాధించమని అర్ధిస్తుంది.

ఆవేళ పండుగ జరుపుకొని ఆనందహేలతో తనకు ఆత్మశాంతి ప్రసాదించాలనీ కోరుకుంటుంది. తన త్యాగంతో ఎందరి కళ్లనో తెరిపిస్తుంది. ప్రతి ఏట ఆమె సంస్మరణ పేరిట జరిగే పండుగే బతుకమ్మ పండుగ. భర్త ఆమె కోరిక మేరకు ప్రతి ఏటా బతుకమ్మ పండుగ జరిపి అనుకూల దాంపత్య శోభకు మరింత వన్నె కలిగిస్తాడు.

పూలబాల అలంకరణ :

బతుకమ్మ పండుగ, బతుకమ్మ ప్రతీకగా మొలిచిన తంగేడు మొక్క
పూవుతోనే రూపొందుతుంది. పెద్ద బతుకమ్మ పేర్పలో ఇంతో నేర్పు ఓర్పు వుండాలి. లేకుంటే నీట పడగానే విచ్చుకపోతుంది. అందువల్ల గట్టిగా దారాలతో బిగించేలా దట్టమైన పూవుల మధ్య పూల మొక్కలు, గునుగు, ఆకువంటివి నింపుతారు. మొదటగా మతైదువలు పట్టుచీరలు ధరించి ఊరేగింపులో పాలుపంచుకుంటారు. వాళ్లు తమతమ బతుకమ్మల్ని తలపై ధరించి ఊరేగింపులో పాలుపంచుకుంటారు. ఊరి బయటకు ఊరేగింపు చేరగానే అక్కడ చెరువు వద్ద కాసేపు బతుకమ్మను పెట్టి మళ్లీ ఓ రెండు చుట్లు తిరిగి బతుకమ్మను నీళ్లలో నిమజ్జనం
చేస్తారు.

'పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ
పోతేపోతివిగాని మళ్లెప్పుడొస్తావే'

అంటూ పాడుతూ బతుకమ్మను సాగనంపుతారు. తర్వాత తాము తెచ్చుకున్న కొబ్బరి కోరు, పులిహోర తమ బంధుమిత్రులకు పరస్పరం ఇచ్చుకోవమ్మ వాయినం, పుచ్చుకోవమ్మ వాయినం అంటూ పంచుకుని తాము తీసుకుని ఇళ్లకు చేరతారు.

No comments: