THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Sunday, October 2, 2022
శరన్నవరాత్రులలో నేడు మూల నక్షత్రం సందర్బంగా బెజవాడ దుర్గమ్మ సరస్వతీదేవి అలంకరణలో దర్శనం ఇస్తున్నారు...!!
🌹సరస్వతీ దేవి చరిత్ర 🌹
🌷చదువుల తల్లి🌷
దేవనాగరి : సరస్వతీ
తెలుగు : సరస్వతీ దేవి
వాహనం : హంస , నెమలి
🌿మన సాంప్రదాయం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది.హ
ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు , పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి , సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి.
🌸నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.
🌿స్వరూపం ఋగ్వేదంలోనూ , దేవీ భాగవతంలోనూ , బ్రహ్మ
వైవర్త పురాణంలోనూ (2.6.13-95) , పద్మ పురాణంలోనూ సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి.
🌸సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని ,
🌿సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ.
🌸సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.
🌿వాక్ , బుద్ధి , వివేకం , విద్య , కళలు , విజ్ఞానం –
🌸వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని
పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా , వీణాపాణిగా , పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది.
🌿 సరస్వతి వర్ణనలలోతెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. “శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు”నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.
🌸సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”.
పరాశక్తి , జ్ఞాన ప్రదాతసరస్వతి – రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం – 9 వ శతాబ్దానికి చెందినది.
🌿పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది.
🌸 మహామాయ , భాషా జ్యోతిర్మయి , కళారస హృదయగా సరస్వతీ
పూజలందుకొంటోంది.
🌹జ్ఞాన ప్రదాతగా సరస్వతి కొన్ని గాధలు 🌹
🌿పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు.
🌸శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు.
🌿ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు.ల్అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది.ఓ
🌸29 అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు.
🌿పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు.
🌸వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని
పొందాడు.
🌿వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు
🌸. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని , పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని
అడిగాడు.
🌿శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు.
🌸అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.
🌿పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి.
🌿అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.
🌸అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు.
🌿 యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు ,
🌸జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన , జ్ఞాపక శక్తులను ప్రసాదించమని , విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని , గ్రంధ రచనా శక్తి , ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు.
🌿సత్సభలలో మంచి విచారణ శక్తిని , సత్య స్వరూపిణి , వ్యాఖ్యాన రూపిణి , వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా , సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు.
అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment