ఒకసారి నారదుడు ఇనుప సెనగలను వండి వడ్డించమని జగన్మాతలైన భారతి(సరస్వతి), పార్వతి, లక్ష్మీదేవతలను కోరగా అది అసాధ్యమని వారనెను. అప్పుడు నారదుడు, "ఈ చిన్నపనిని అత్రి మహా ముని భార్యయైన మహా పతివ్రత అనసూయాదేవి చేయగలదు" అని పలికి అనసూయ వద్దకు వెళ్ళి "తల్లీ! ఈ ఇనుప సెనగలను నాకొరకు వండి వడ్డించుమనెను". అనసూయ తన పతిదేవుని ప్రార్థించి నారదుని అభీష్టమును నెరవేర్చెను. ఇది ముగ్గురమ్మలకు అవమానముగా తోచి, అనసూయను పరీక్షించమని త్రిమూర్తులను వేడుకొనెను. త్రిమూర్తులు దానికి అంగీకరించి అత్రి ఆశ్రమమును చేరి "భవతి భిక్షాందేహిః" అని నగ్న దేహిగా వడ్డించమని ముగ్గురు అతిదులై ముంగిటనిలుస్తారు. అప్పుడు అనసూయ త్రిమూర్తులను పసిపాపలుగా మార్చుకొని భూత భవిష్యత్ వర్తమానముల మాతృ జన్మ ఈడెత్తుకొని హరిహర బ్రహ్మలను ముద్దాడుతుంది. అదితెలిసిన ఉమతి, రమతి, భారతి మహా పతివ్రత అయిన అనసూయమ్మను పతిభిక్ష పెట్టమని కోరతారు. ఆమె కరుణించి ఆ వరమిచ్చి త్రిమూర్తుల అంశతో తమకొక కుమారుడ్ని ఇవ్వమని కొరుతుంది. "దత్తాత్రేయుడు" జన్మిస్తాడు. త్రిమూర్తులు తమ అంశను "సమర్పించుకున్నారు" కనుక అతడికి "దత్త" అని పేరు వచ్చింది. అత్రి కుమారుడు కనుక "ఆత్రేయ" అయింది.
THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Thursday, October 6, 2022
దత్తాత్రేయుడు
ఒకసారి నారదుడు ఇనుప సెనగలను వండి వడ్డించమని జగన్మాతలైన భారతి(సరస్వతి), పార్వతి, లక్ష్మీదేవతలను కోరగా అది అసాధ్యమని వారనెను. అప్పుడు నారదుడు, "ఈ చిన్నపనిని అత్రి మహా ముని భార్యయైన మహా పతివ్రత అనసూయాదేవి చేయగలదు" అని పలికి అనసూయ వద్దకు వెళ్ళి "తల్లీ! ఈ ఇనుప సెనగలను నాకొరకు వండి వడ్డించుమనెను". అనసూయ తన పతిదేవుని ప్రార్థించి నారదుని అభీష్టమును నెరవేర్చెను. ఇది ముగ్గురమ్మలకు అవమానముగా తోచి, అనసూయను పరీక్షించమని త్రిమూర్తులను వేడుకొనెను. త్రిమూర్తులు దానికి అంగీకరించి అత్రి ఆశ్రమమును చేరి "భవతి భిక్షాందేహిః" అని నగ్న దేహిగా వడ్డించమని ముగ్గురు అతిదులై ముంగిటనిలుస్తారు. అప్పుడు అనసూయ త్రిమూర్తులను పసిపాపలుగా మార్చుకొని భూత భవిష్యత్ వర్తమానముల మాతృ జన్మ ఈడెత్తుకొని హరిహర బ్రహ్మలను ముద్దాడుతుంది. అదితెలిసిన ఉమతి, రమతి, భారతి మహా పతివ్రత అయిన అనసూయమ్మను పతిభిక్ష పెట్టమని కోరతారు. ఆమె కరుణించి ఆ వరమిచ్చి త్రిమూర్తుల అంశతో తమకొక కుమారుడ్ని ఇవ్వమని కొరుతుంది. "దత్తాత్రేయుడు" జన్మిస్తాడు. త్రిమూర్తులు తమ అంశను "సమర్పించుకున్నారు" కనుక అతడికి "దత్త" అని పేరు వచ్చింది. అత్రి కుమారుడు కనుక "ఆత్రేయ" అయింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment