THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, October 1, 2022
శ్రీ లక్ష్మీ నారాయణీ స్వర్ణ దేవాలయం, వెల్లూర్...!!
🌹🙏( గోల్డెన్ టెంపుల్ )🙏🌹
🌸తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. కొన్ని ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలు కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి శ్రీపురం లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం.
🌿బంగారు దేవాలయం అంటే ఒకప్పుడు అమృతసర్ లోని గురుద్వారా.. అయితే ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా గుర్తుకొస్తుంది.
🌸ఇక్కడ స్థంభాలు బంగారం, వాటి పై శిల్పకళా బంగారం, గోపురం, విమానం,అర్ధమంటపం, శటగోపం అన్నీ బంగారంతో చేసినవే.. మరి కాబట్టే స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.
🌿శ్రీపురం స్వర్ణ దేవాలయం వెల్లూర్ లోని మలై కొడి ప్రదేశంలో నిర్మించారు. దీనినే 'ది గోల్డెన్ టెంపుల్ అఫ్ వెల్లూర్' అని పిలుస్తారు. శ్రీ శక్తిఅమ్మ అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు.
🌸ఈ ఆలయం లోపల, బయట రెండు వైపులా బంగారు పూతతో మహాలక్ష్మి ఆలయం ఉంది. ఈ దేవాలయం వ్యయపరంగా, విస్తీర్ణం పరంగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం కంటే చాలా పెద్దది.
🌿ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడం చేసేందుకు చాలా ఖర్చు పెట్టారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య, తిరుపతి శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల స్థపతి శ్రీనివాసన్‌ల పర్యవేక్షణలో నిర్మాణం కొనసాగింది.
🌸దాదాపు 400 మంది (తిరుమల తిరుపతి దేవస్థానానికి బంగారు తాపడంలో పాలుపంచుకున్న వాళ్లూ వీరిలో ఉన్నారు) రేయింబవళ్లు కష్టపడితే దేవాలయ నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.ఆలయానికి రాజగోపురం ఉంది.
🌿తిరుమల ఆలయానికి మల్లే చుట్టూ 36 స్తంభాలున్నాయి. మధ్యలో ఉన్న షాండ్లియర్ పూర్తిగా బంగారంతో చేసిందే. ఆలయ ప్రాంగణంలో 30 వేల మొక్కలు, ఉద్యానవనాల్లో లక్ష మొక్కలు నాటారు. అందమైన ఫౌంటెన్‌లు అదనపు హంగుల్ని చేకూరుస్తున్నారు.
🌸ఆలయానికి ప్రత్యేకమైన లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాంతుల్లో దేవాలయ శిల్పకళాచాతుర్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది.
🌿ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారి ఎదుట 27 అడుగుల ఎత్తైన పంచలోహలతో చేసిన పది అంచెల దీపస్తంభం ఉంటుంది. ఇందులో వెయ్యి వత్తులతో దీపారాధన చేస్తారు.
🌸ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. శ్రీపురం స్వర్ణ దేవాలయంలో చేతితో చేసిన బంగారు షీట్ లు 9-15 పొరలుగా ఉన్నాయి. దీనిని 1500 కిలోల బంగారంతో కట్టించారని చెపుతారు.
🌿ఆలయంలో ఎలాంటి నామస్మరణలు చేయకూడదు. ప్రవేశం మొదలు దర్శనం పూర్తయి, వెలుపలికి వచ్చే వరకూ భక్తులు మౌనం పాటించాలి.
🌸భక్తులు ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు డ్రెస్ కోడ్ తప్పని సరిగా పాటించాలి. పొట్టి ప్యాంట్లు, మిడ్డీలు, నైటీలు, లుంగీలు, బెర్ముడాలు వంటివి పూర్తిగా నిషేధం. చీరలు, పంచలు కట్టుకొని లేదా సంప్రదాయ దుస్తులు ధరించి లోనికి వెళ్ళటం ఉత్తమం.
🌿మొబైల్ ఫోన్ లు, కెమరా, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు పొగాకు, మద్యం అలాగే మండే వస్తువులను లోనికి అనుమతించరు.
🌸సంవత్సరం పొడవునా ఈ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించవచ్చు. ఉదయం 7.30 నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరచి వుంటారు...స్వస్తి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment