Adsense

Saturday, October 1, 2022

శ్రీమాన్ మహాలక్ష్మీ...!!

 


శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరము తెచ్చింది
శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరము తెచ్చింది

కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులేత్తి ఎదురేగ రండి
జనులారా రండి ఎదురేగ రండి
శుక్రవారపు సిరిని సేవించరండి

శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరంతెచ్చింది

సిద్ధి బుద్దుల నొసగు భారతి మూర్తి
ఆఆ.. ఆఆ...
శక్తి యుక్తుల నొసగు పార్వతి మూర్తి
ఆఆ...ఆఆ....

అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి
ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి

కల లేని కన్నులకు కనిపించదండి
కలత ఎరుగునై సతుల కరుణిచునండి

శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరంతెచ్చింది

ఆ ఆ ఆ

ముత్తైయుదువుల పసుపు కుంకుమల సాక్షి...
పారాణి పాదాల అందియల సాక్షి..
పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి...
నిత్యమంగళ నట్టిల్లే సాక్షి....

అటువంటి ఇల్లే కోవెలగ ఎంచి..
కొలువుండు  ఆ కలిమి కామాక్షి వచ్చి....

శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరంతెచ్చింది..

No comments: