THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, October 11, 2022
నమః శివాయ
ఎవరు పంచాక్షరీ మహామంత్రము నుచ్చరించుచూ శివలింగ మందు పుష్పము సమర్పించుదురో అట్టి వారికి వేయి వాజపేయ (అశ్వమేధ) మహాయాగములు చేసినంతటి పుణ్యఫలము గల్గునని చెప్పెదరు.
నమఃశివాయ అంటూ లింగార్పితమైన ఒక్కనీటి బొట్టునకు కూడా శివుడు మహదానందపడి ఆత్మలింగాన్నే కాదు తనకు తానుగా ముంగిట నిల్చి సేవకుడై సేవలందించును.
వెలకట్టలేని ఆభరణములు ఎన్నో సమర్పించిననే ఇతర దేవతలు ప్రీతిచెందరు. శివార్పణమంటూ నమః శివాయ మంత్రమున వదలిన బూడిదను కూడా శివుడు ప్రీతితో గ్రహించి శరీరము నిండా తాను పూసుకొని భూరి సంపదలు ప్రసాదించును.
ఎన్నో జన్మజన్మలుగా వెంటనంటి వచ్చు పాశబంధములను పాపపు కారునీడ వంటి నల్లని ఏనుగుల పాలిట సింహగర్జనము నమఃశివాయ.
పలుకుల తల్లి సరస్వతి నిరంతరం తన వీణ తంతులపై నమశ్శివాయ మంత్ర సుమములు పూయించుచున్నందుననే శివుని అంతఃశక్తి వలన తాను సర్వ విద్యాధి దేవతగా పూజలందుకొనుచున్నది. “ఈశాన స్సర్వ విద్యానామ్.” (శ్రుతి)
భక్తితో శివుని దరిచేరిన ఎల్లవారికి ఆపదలు దరిచేరనీక అండగా నిలిచి హృదయ శోకమును నివారించి మనశ్శాంతిని దాంతిని చేకూర్చి సంతోషమును, ఆనందములను ప్రసాదించి తేజస్సుతో పునీతులను చేయు అమృతరసఝరి నమః శివాయ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment