Adsense

Tuesday, October 11, 2022

శ్రీ రామునికి అగ్ని పరీక్ష



రావణ వధానంతరం సీతకు రాముడు అగ్నిపరీక్ష విధించాడు. కానీ అంతకు ముందే సీత రామునికి అగ్ని పరీక్ష విధించింది. సీతాన్వేషణ కు లంకకు వెళ్ళిన హనుమంతుని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుని సమక్షంలో నిలుపుతాడు. హనుమంతుని పై కోపించిన రావణుడు అతని తోకకు నిప్పు పెట్టమని చెపుతాడు. రాక్షసులు హనుమ వాలమునకు నిప్పు పెడతారు. ఆ నిప్పుతోనే హనుమంతుడు లంకాదహనం చేస్తాడు. ఆ సమయంలో అశోకవనంలో ఉన్న సీతాదేవి,

“నా భర్త పరస్త్రీని కోరని వాడైతే, ధర్మస్వరూపుడే కనుక అయితే, నేను మనసా వాచా పరపురుషుని కోరని దాననైతే హనుమ వాలమున కాలుచున్న అగ్ని చల్లారును గాక" అని సంకల్పించింది. హనుమంతుని తోకచల్లారింది.

అలా సీత పెట్టిన అగ్ని పరీక్షలో శ్రీరాముడు నిగ్గుతేలాడు. రామ కార్యార్థి కనుక ఆ అగ్ని హనుమంతుని ఏమీ చేయలేక పోయింది.

No comments: