THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, October 1, 2022
మహబూబ్ నగర్ జిల్లా : అలంపూర్ శ్రీ నవ బ్రహ్మ ఆలయం.
💠 బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలు , వాటికి నిత్యం ఆగమ సంప్రదాయ రీతిలో పూజలు జరుగుతున్న , నవబ్రహ్మ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా...
💠 ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి.
బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలు ఉండడం, వాటికి నిత్యం ఆగమ సంప్రదాయ రీతిలో పూజలు చేయడం కూడా విశేషం.
భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే వారణాశి, (కాశీ)ని సందర్శించిన ఫలితం లభిస్తుందని స్కందపురాణం చెబుతోంది.
💠 పూర్వం దక్షిణ కాశి క్షేత్రంలో బ్రహ్మ, బ్రహ్మత్వం కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవునికి తొమ్మిది రూపాలలో దర్శనభాగ్యం కలిగించి బ్రహ్మదేవుడి కోరిక మేరకు తొమ్మిది రూపాలలో శివుడు బ్రహ్మ పేరుమీద నవ బ్రహ్మేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నాడు.
💠 పేరులో బ్రహ్మ ఉన్నా అవి శివాలయాలు. మొత్తం తొమ్మది ఒకే చోట కొలువై ఉన్నాయి. ఆ తొమ్మది దేవాలయాలు కూడా ఒక శక్తిపీఠం ఉన్న చోటున ఉన్నాయి. అందుకే వాటిని సందర్శిస్తే మొత్తం కష్టాలన్నీ తొలిగిపోతాయని చెబుతారు. దీంతో శివుడికి అత్యంత ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఈ దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
💠 అలంపురంలో నవబ్రహ్మ ఆలయాలు నిర్మాణం చేయడానికి ఒక సిద్ధుడు కారణం.
పూర్వం కాశీ క్షేత్రంలో ఒక వితంతువు శ్రీ తనకు శిశువు కావాలని కోరికతో శివుడు గురించి తపస్సు చేయగా శివుడు వరాన సిద్ధుడు జన్మించడం జరిగింది. కాలానుగుణంగా సిద్ధుడు పెరిగి పెద్దవాడైయేసారిగి తండ్రి గురించి తెలుసుకోవాలని తండ్రి లేకుండా ఎలా జన్మించావని తోటి వారు హేళన చేస్తున్నారని తన తల్లిని గట్టిగా అడగగా తల్లి కొడుకుతో ఇలా చెప్పెను...' నాయనా కుమార మీ తండ్రి శివుడే .
శివుడు వలన జన్మించిన వాడవు' అని చెప్పేసరికి ఆ శివుడు గురించి ఘోర తపస్సు చేసేను తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై సిద్ధ నీవు జన్మించినది ఒక పుణ్యకార్యం చేయడానికి దక్షిణ కాశీ లో బ్రహ్మ కోరిక మేరకు తొమ్మిది రూపాలలో దర్శనం ఇచ్చాను బ్రహ్మ పేరుతో తొమ్మిది ఆలయాలు నా పేరు మీద నిర్మించే పుణ్య కార్యం చేయాలి అని శివుడు సిద్ధుడుకి చెప్పి , చెట్లమూలికల రసంతో బంగారం చేసే వరం ఇచ్చెను .
ఆ వరంతో రససిద్ధుడు తన శిష్యులతో కాశీ క్షేత్రం నుండి దక్షిణ కాశి అలంపురంకు వచ్చి గుళ్ళు నిర్మాణం చేసాడ
💠 తుంగభద్ర నది యొక్క ఎడమ ఒడ్డున నవాబ్రహ్మ దేవాలయాలు ఒక ప్రాంగణంలో ఉన్నాయి.
ఈ తొమ్మది దేవాలయాల పేర్లు వరుసగా..
🔅తారక బ్రహ్మ,
🔅స్వర్గ బ్రహ్మ,
🔅పద్మ బ్రహ్మ,
🔅బాల బ్రహ్మ,
🔅గరుడ బ్రహ్మ,
🔅అర్కా బ్రహ్మ,
🔅కుమార బ్రహ్మ,
🔅వీర బ్రహ్మ,
🔅విశ్వ బ్రహ్మ దేవాలయాలు.
💠 తారక బ్రహ్మ దేవాలయం -
ఈ ఆలయం పాక్షికంగా శిథిలాలలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహంకూడా లేదు!
💠స్వర్గ బ్రహ్మ దేవాలయం -
అలంపూర్ లోని దేవాలయాలలో సుందరమైందిగా చెప్పబడుతుంది.
ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునక.
💠పద్మ బ్రహ్మ దేవాలయం. -
ఇది కూడా పాక్షికంగా శిథిలమైంది, ఇందులో ఓ అద్భుతమైన స్పటిక శివలింగం ఉంది.
💠 విశ్వబ్రహ్మ దేవాలయం - చాలా మంచి చూడ చక్కని నిర్మాణం, ఇక్కడ రామాయణ మహాభారత దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కారు.
💠బాల బ్రహ్మేశ్వరాలయం -
ఆలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాల్లోకెల్లా బాల బ్రహ్మ దేవాలయం ముఖ్యమైనది,పెద్దది .
ఇక్కడ ఇప్పటికీ పూజాదికార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
ఈ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఒక వసారా కూడా ఉంది. ఈ గుడిలో సప్తరుషుల విగ్రహాలను మనం చూడొచ్చు. ఈ దేవాలయంలోని విగ్రహం వింతగా ఉంటుంది. ఒక లింగం మధ్యలో బిలం ఉంటుంది.
ఈ బిలంలో మరోక శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకొక విగ్రహం కూడా చూడటానికి వింతగా ఉంటుంది. ఒక నల్లరాతి పై నగ్నంగా రెండు మోకాళ్లను దవడలకు తగులునట్లు కుర్చొన్న ఒక స్త్రీ విగ్రహాన్ని మనం చూడొచ్చు. దీనిని భూదేవి విగ్రహంగా చెబుతారు.
💠గరుడ బ్రహ్మాలయం -
ఈ ఆలయము గోపురములు శిథిలమై పోయినవి. ఇందలి గోడలపై అద్భుతమైన శిల్పములు ఉన్నాయి.
💠అర్క బ్రహ్మాలయం -
ఈ ఆలయం కుమారబ్రహ్మ గుడివలెనే నిర్మించబడింది.ఇందులో ప్రదక్షిణకుపయోగించు చుట్టువసారా ఒక విశేషము.
💠కుమార బ్రహ్మాలయం -
ఇందు ముఖమంటపం, ప్రవేశమంటపం, వానివెనుక గర్భాలయాలు ఉన్నాయి. ఇచటి స్తంభాలపై చెక్కడపుపని ఎల్లోరా అజంతా శిల్పాలను స్మృతికి తెచ్చును.
💠 వీర బ్రహ్మాలయం -
ఈ గుడిలో ఒక వేదికపై లింగం ప్రతిష్ఠింపబడింది. ఈ వేదికకు నాలుగు వైపులను రాతిస్తంభాలు ఉన్నాయి. తాండవనృత్యం చేయు శివుని విగ్రహ శిల్పం, ప్రణయగోష్ఠిలోనున్న గంధర్వ దంపతుల బొమ్మలు చూడవల్సినవి.
💠 ఈ ఆలంపూర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఆలంపూర్ ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment