THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, October 5, 2022
విజయదశమి -రామ్ లీలా మహోత్సవం..
🌸శరవన్నవరాత్రులలో పదవ రోజైన దశమినాడు దక్షిణాది రాష్ట్రాలలో విజయదశమి, ఆయుధపూజ పండుగలుగా చేసుకోవడం ఆనవాయితీ.
🌿ఉత్తర ప్రదేశ్ లోని ప్రజలు శ్రీ రాముడు రావణుని జయించి సీతాదేవి తో అయోధ్యకు తిరిగి వచ్చిన శుభతరుణంగా విజదశమి గా పండుగ జరుపుతారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రామలీలా ఉత్సవాలను వైభవంగా జరుపుతారు.
🌸పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని, జమ్మి వృక్షం మీద తాము దాచి వుంచిన ఆయుధాలు తిరిగి తీసుకుని వాటికి పూజలు చేసిన రోజు కూడా విజయదశమి నాడే. ఆ క్రమంలోనే ఆయుధ పూజ ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఐహీకం.
🌿విజయదశమినాడు అనేక ఆలయాలలో జమ్మి కొమ్మలు పెట్టి, మహావిష్ణువుని ఆవాహన చేసి పూజలు జరుపుతారు.
🌸దేశం అంతా నవరాత్రి పర్వదినాలలో యజ్ఞయాగాలు, పూజలు, హోమాలు, నోములు, వ్రతాలతో పాటు అనేక సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి
ధ్యానంలో ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు.
🌿పడమటి ప్రాంతమైన గుజరాత్ లో నవరాత్రి ఉత్సవాలలో ప్రసిద్ధి చెందిన గర్భా, మరియు దాండియా నృత్యాలతో ఈ పండుగను కోలాహలంగా జరుపుతారు.
🌸నవరాత్రులలో ఆఖరి ఐదు రోజులు భారతదేశపు ఉత్తర తూర్పున పడమటి
వంగ దేశంలో దుర్గా పూజలుగా ఆనుష్టించబడతాయి.
🌿ఎనిమిదవ రోజున దుర్గాదేవి అవతరించిన దుర్గాష్టమిగా ఉత్సవాలు జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్టించి ఐదు రోజులు పూజలు జరిపి మరునాడు నదిలో నిమజ్జనం చేస్తారు...స్వస్తి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment