THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, October 5, 2022
విజయం ఎవరికైనా ఆనందాన్నిస్తుంది...!!
🌿తనను తాను గెలిచిన వారికి ఆనందం శాశ్వతమవుతుంది. అంతటి విజయాన్ని, ఆత్మానందాన్ని సొంతం చేసేది జగన్మాత.
🌸అందుకే ఆది శంకరులు జగదంబను ‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ’ అంటూ స్తుతించారు. విజయం కోసం ఆదిశక్తిని కొలవాల్సిన రోజు విజయదశమి. ఆ రోజు ఏం చేయాలంటే....
🌿తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో జగన్మాతను పూజించాలి. నవరాత్రి వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత పదో రోజు ఆమెను అపరాజితాదేవిగా కొలవాలని నిర్దేశించారు. అపరాజిత అంటే పరాజయం లేనిది.
🌸 సర్వకాలసర్వావస్థల్లో విజయాన్నందిస్తుందీమె. విజయదశమినాటి మధ్యాహ్న సమయంలో అపరాజితా దేవిని ఆవాహన చేసి అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు.
🌿‘అపరాజితాయై నమః, జయాయైనమ్, విజయాయై నమః’ అంటూ స్తుతించినా ఆమె కరుణకు పాత్రులవుతారని చెబుతారు.
🌸సృష్టిక్రమంలో భాగంగా బ్రహ్మ అగ్నిని కూడా సృష్టించాడు. వెంటనే అగ్ని విజృంభించి తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టింది.
🌿 దీంతో విధాత అగ్నిని శమింపజేసేందుకు పచ్చని జమ్మి చెట్టును సృష్టించి దాని కొమ్మలతో అగ్నిని ఆపాడని పురాణగాథ.
🌸అలా శమీ వృక్షం పూజనీయమైంది. శమీవృక్షాన్ని సాక్షాత్తు అపరాజితా దేవి రూపమని కూడా కొందరు చెబుతారు.
🌿విజయదశమినాటి సాయంత్రం గ్రామ పొలిమేరలకు ఆవలనున్న జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు.
🌸ద్వాపర యుగంలో పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని వస్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందని, అప్పటి నుంచి వారికన్నీ విజయాలే లభించాయని చెబుతారు.
🌿 అప్పటినుంచి విజయ దసమి నాడు ఆ పక్షి దర్శనం శుభసూచకంగా భావిస్తారు.
🌿దసరా రోజు అందరూ తమ పనిముట్లను శుభ్రపరిచి పూజిస్తారు. విజయదశమి ముందు రోజు మహార్నవమి నాడు ఆయుధపూజ చేసే సంప్రదాయం తమిళనాడులో ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment