Adsense

Sunday, October 2, 2022

నేడు సరస్వతీ పూజ విధానం: ఎలాంటి పూలు, దుస్తులు వాడాలి...!!



🌸సరస్వతీం చతాం నౌమి వాగధిష్ఠాతృ దేవతాం
దేవత్వం ప్రతిపద్యంతే యదనుగ్రహతో జనా:

🌿(అర్థం- వాక్కుకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతీ మాతా..! నీ అనుగ్రహం పొందిన వారు దైవత్వం కూడా పొందగలుగుతున్నారు)

🌸అన్ని విద్యలకి అధి దేవత అయిన తల్లి సరస్వతీ మాత, ఆ తల్లిని పూజించిన వారికి తద్వారా ఆమె అనుగ్రహం పొందినచో అన్నిరకాల ఆటంకాలు విద్యాపరంగా తొలగిపోతాయి.

🌿దేవీ నవరాత్రుల 9 రోజులలో 9అలంకారాలతో పూజించడం అలవాటు. కానీ దేవీ మాహాత్మయం మొదలైన గ్రంథాలలో 9రోజుల పాటు 9 రూపాలు ( శైలపుత్రీ, బ్రహ్మచారిణి మొదలైనవి 9) వేరుగా చెప్పారు.

🌸ఇవి కాకుండా వెంకటేశ్వర స్వామి 9రోజుల పాటు 9 వాహన సేవలు చెప్పబడింది.

🌿ఇందులో ప్రత్యేకంగా చేసేపూజలలో అందరూ పాల్గొనేవి ఇవి.

🌸కుమారీ పూజ,
🌿శమీ పూజ,
🌸ఆయుధ పూజ,
🌿సరస్వతీ పూజ.

🌸ఇప్పుడు ప్రత్యేకంగా సరస్వతీ పూజ విధానం గురించి చెప్పుకుందాం.

🌿మూలా నక్షత్రం, సప్తమినాడు వచ్చిన రోజున చేయవలసింది ఈ పూజ. వీలైన వారు గుడిలో, దేవీమంటపాలలో, లేని స్థితులలో ఇంటిలో సరస్వతీ పటం ఉంచి పూజించ వచ్చు.

🌸సరస్వతీ పూజకి తెల్లపూలు వాడాలి. చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే పట్టుబట్టలు లేదా తెల్లనివస్త్రాలు ధరించాలి.

🌿అమ్మవారిముందు తాము చదువుకునే పుస్తకాలు, పెన్నులు 2 ఉంచి, అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలను కూడా పూజించాలి.

🌸అమ్మవారి నవరాత్రులలో 9రోజులకి 9దేవతలకి విడివిడిగా అష్టోత్తర నామాలు, సహస్ర నామాలు చదువుతూ పూజించాలి .

🌿నైవేద్యం - క్షీరాన్నం, పాలతో బెల్లం నైయ్యివంటి పదార్థాలు కలిపి చేసినవి నివేదించాలి, చలివిడి వడపప్పు పానకం వంటివి ప్రత్యేక నైవేద్యాలు. నానబెట్టి మొలకలు ఎత్తించిన పెసర్లు, సెనగలు వంటి పదార్తాలు చాలా మంచి ఫలితాలు ఇచ్చే నైవేద్యాలు.

🌸ప్రదక్షిణ, స్తోత్రాలు. వీలైనంత వరకు చేయాలి.

🌿ఉపవాసం ఉండాలా ? - పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు ఉపవాసం ఉండకూడదు. అసలు ఏమీ తినకుండా కూడా అమ్మవారిని పుజించకూడదు...స్వస్తి..

No comments: