Adsense

Wednesday, October 12, 2022

మహబూబ్ నగర్ జిల్లా.. శిరుసనగాండ్లశ్రీ సీతరామచంధ్రస్వామి ఆలయం




💠 శిరుసనగాండ్ల గ్రామం లో వెలసిన పురాతన శ్రీ సీతా రామ క్షేత్రం ఇది...
ఉమ్మడి మెహబూబ్ నగర్ జిల్లా, ( ప్రస్తుతం నాగర్‌ కర్నూల్ జిల్లా) చారకొండ మండలం, సిర్సనగండ్ల గ్రామంలో నెలకొని ఉంది.

🔅 ఇది అపర భద్రాద్రిగా పేరుగాంచింది.

💠 ఈ ఆలయాన్ని 14వ శతాబ్దిలో నిర్మించబడినట్లు అక్కడ ఉన్న శిలాశాసనాల వల్ల తెలుస్తుంది.
అప్పుడు ఈ ప్రాంతం భీకర అరణ్యంగా ఉండేదని, గుట్టపై దత్తాత్రేయ ఆశ్రమం, ముత్యాలమ్మ గుడి ఉండేవని స్థానికుల కథనం.

💠 సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రామయాజ్వికి శ్రీరాముడు కలలో కనిపించి భద్రాచలంలో ప్రతిష్ఠించాల్సిన సీతారామ విగ్రహాలు ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని రావిచేడ్ గ్రామంలో ఒక పురోహితుడి ఇంటి పెరటిభాగంగా ఉన్నట్లు చెప్పినట్లు, ఆ విగ్రహాలు సకాలంలో భద్రాచలానికి చేరనందున వేరే విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించినట్లు, వాటిని సిర్సనగండ్లలో ప్రతిష్ఠించమని చెప్పినట్లు కథనం ప్రచారంలో ఉంది.

💠 కలలో శ్రీరాముడు చెప్పిన విధంగా పాల్వంచ సమీపంలోని విగ్రహాలు తీసుకొని వచ్చి కోడి కూత, రోకలి మోత వినిపించని సిర్సనగండ్ల గుట్టపై ప్రతిష్ఠించబడినట్లు, గుట్టపై కోనేరు కూడా నిర్మించినట్లు తెలుస్తుంది.

💠 ఒకప్పుడు ఈ ప్రదేశం దండకారణ్యమయిన ఈ ప్రాంతంగా ఉండేది. ఇక్కడ దత్తత్రేయ ఆశ్రమం ఉండేది.
శ్రీరాముడు లక్ష్మణులు సీత దేవిని అన్వేషిస్తూ ఈ ఆశ్రమానికి వచ్చారు.
అప్పుడు దత్తత్రేయుడు కోరిక మేరకు సీతారాములు అర్చావతార రూపంలో ఇక్కడ వెలవాలని నిర్ణయించుకున్నరు అని ప్రతీతి.

💠 దాదాపు 600 ల సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ సీతారాములు వెలిసారని చరిత్ర. దాదాపు 300 అడుగుల ఎత్తులో, 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది.
ఈ ఆలయం శోడశ స్తంభాలతో ఏకప్రాకారాలతో నిర్మితమైంది.


💠" శిరుసనగండ్ల శ్రీ సీతారామ శిరస్సు వంచి మొక్కుతా సరసనే నిలుచొని వరములిఇవ్వు" అంటూ భక్తులు కొండ ఎక్కుతూ వుంటారు. ఇక్కడ సీతారామ కళ్యాణం చాలా అధ్బుతంగా నిర్వహిస్తారు. పెద్ద తేరు ఉత్సవం జరుగుతుంది.

💠 మూలవిగ్రహాలు శ్రీ సీతారామలక్ష్మణులు. ఇక్కడ రాముడు, లక్ష్మణులకు ఇరువురికి మీసకట్టు ఉండటం విగ్రహాల ప్రత్యేకం.

💠 ఇక్కడ నవగ్రహాలు, రామలింగేశ్వరాలయం, శ్రీ హనుమన్ ఆలయం, ముక్కిడి మైసమ్మ, దత్తత్రేయ సన్నిధి, నాగసన్నిధి, రామకోటి స్థూపం, కల్యాణ మంటపం, గణపతి దేవుడు, అంబికా దేవి అను పలు ఉప ఆలయాలున్నయు.

💠 ఈ క్ష్శేత్రం రామాయణ గాథతో ముడిపడింది. కోట్ల మంది దర్శించుకుంటారు. నిత్యపూజలందుకుంటూ ధూపధీపాలతో సంవత్సరాంతం ఉత్సవాలు జరుగుతుంటాయి.


💠 ఏటా ఇక్కడ చైత్రశుద్ధ్య పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

💠 శ్రీ రామ నవమి కి ఘనంగా ఉత్సవాలు నిర్వహించాబడుతాయి .
స్వామి వారి కల్యాణోత్సవం ,రదోత్సవమ్ ఘనంగా జరుగుతాయి .
ఉత్సవాల సమయం లో చాలామంది భక్తులు వస్తుంటారు.
ప్రతి ఒక్కరు దర్శించాల్సిన  క్షేత్రం ఇది .

💠 ఈ ఆలయం కల్వకుర్తి నుంచి దేవరకొండ వెళ్ళు రహదారిలో కల్వకుర్తి నుంచి 30 కిమీ దూరంలో ఉన్న చారకొండ నుంచి 5 కిమీ లోనికి ఉంది.

No comments: