Adsense

Wednesday, October 12, 2022

తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన




శృంగార సంకీర్తన
రేకు: 997-6
సంపుటము: 19-569


దీపించఁ జక్కఁదనము దేవునికిని
పైపైఁ జల్లేరు నేఁడు పన్నీరుకాపు
॥పల్లవి॥


వుడివోనికల్పభూజ మొద్దికఁ గొమ్మలతోనే
పొడవెల్లా దెల్లనై పూచెనోకాక
యెడలేక తిరుమేన నింతటా మెత్తిరిదివో
కడలేనిహరికిని కప్పురకాపు
॥దీపించు॥


తిరమై యాకాసమందు తెల్లనిచంద్రునిమీఁద
వరుస నీల మేఘము వాలెనోకాక
సరసనే శశివర్ణ మైనందు
పురిగొన నించిరిదే పుళుగుకాపు
॥దీపించు॥


పొంచి నీలగిరి మీఁద బొసఁగి బంగారు కొండ
అంచెలఁ గీలించినట్టి యందమో కాక
మించి శ్రీ వేంకటపతి మెడ నలమెలుమంగఁ
జంచులఁ బెట్టి పూసిరి చందనకాపు
॥దీపించు॥

No comments: