THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Thursday, October 13, 2022
శివపూజ - పుష్పాలు - ఫలితాలు
🌸శివపూజకు సంబంధించినంత వరకు..
🌿వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
🌸వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
🌿వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
🌸వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
🌿వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మెత్తపువ్వు ఉత్తమం.
🌸వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పూవు ఉత్తమం.
🌿వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మపూవు ఉత్తమం.
🌸వేయి తుమ్మపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
🌿వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపూవు ఉత్తమం.
🌸వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపూవు శ్రేష్ఠం.
🌿వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం...
🌸 అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది.
🌿శివునికి వేయి నల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమం గలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు.
🌸ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.
🌿పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం.
🌸ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
🌿ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి.,
🌸నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది..స్వస్తి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment