THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Sunday, October 2, 2022
వశిష్ఠుడు దక్షప్రజాపతి కూతురు వివాహం...
🌿వశిష్ట మహర్షి మహా తపస్సి అని తలచిన దక్షుడు తన స్థాయికి తగ్గ అల్లుడు అని
🌸విశిష్టని దక్షుడు నా కుమార్తెను ప్రాణిగ్రహము చేయము అని కోరిక కొరతాడు దక్షుడు
🌿దక్షడు మాటను గౌరవించి వశిష్ఠుడు వివాహము ఒప్పుకుంటాడు వశిష్ఠుడు
ఊర్జను వివాహమాడి
🌿ఆమెయందు రజుడు, గోత్రుఁడు, ఊర్ధ్వబాహువు, సవనుఁడు, అనఘుఁడు, సుతపుఁడు, శుక్రుఁడు అని ఏడుగురు పుత్రులను పొందెను.
🌸వారు స్వాయంభువ మన్వంతరమున సప్తర్షులుగ ఉండిరి. ఇతఁడు తొలుత బ్రహ్మమానసపుత్రుడు అయి ఉండి నిమి శాపముచేత ఆ శరీరమునకు నాశము కలుగగా మిత్రావరుణులకు మరల జన్మించెను.
🌿ఒకప్పుడు మిత్రావరుణులకు ఊర్వసిని చూచి రేతస్సు స్ఖలితము అయి అది ఒక కుంభమునందు చేర్పబడగా అందుండి వసిష్ఠుడును, అగస్త్యుఁడును పుట్టిరి. కనుక వీరు ఇరువురును కుంభజులు అనబడుదురు...
🌹వశిష్ఠుడు అరుంధతి వివాహం :🌹
🌸 ఒకసారి నిమి వెయ్యి సంవత్సరాల సత్రయాగం చెయ్యాలనుకుంటున్నాను మీరు హోతగా వుండాలని గురువుగారిని అడిగాడు.
🌿వసిష్ఠుడు నాకు అభ్యంతరం లేదు కానీ , నీ కంటే ముందే ఇంద్రుడు వంద సంవత్సరాలు యాగం చెయ్యాలనడిగాడు. అందుకు సరేనన్నాను . కనుక అది అయిపోగానే ఇది మొదలుపెడుదాము అని చెప్పి వెళ్ళిపోయాడు. నిమి సత్రయాగానికన్నీ సిద్ధం చేసుకుని గౌతమ మహర్షిని హోతగా పెట్టుకుని యాగం ప్రారంభించాడు.
🌸వంద సంవత్సరాలు అయిపోగానే వసిష్ఠుడు తిరిగి వచ్చి నిమిని చూసి నన్ను హోతగా వుండమని చెప్పి వేరే వాళ్ళని కనీసం నాకు ఒకమాట కూడ చెప్పకుండా పెట్టుకున్నావు కాబట్టి నువ్వు శరీరం లేకుండా పోతావని శపించాడు.
🌿నిమి కూడా వసిష్ఠుడ్ని శపించాడు. అప్పుడు గౌతమ మహర్షి మొదలైన వాళ్ళు ఆ శరీరం పాడవకుండా చూస్తూ యాగం పూర్తి చేశారు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా నిమి కోరిక ప్రకారం అన్ని జీవుల కళ్ళమీద ఉండేలా వరమిచ్చారు.
🌸అంటే మనం కళ్ళార్పుతూ వుంటాము అందుకే నన్నమాట! వసిష్ఠుడు శరీరం విడిచి పెట్టి తన తేజస్సునీ , యోగ విద్యా బలాన్ని మిత్రవరుణుల్లో ప్రవేశపెట్టాడు. మిత్రవరుణులు ఊర్వశిని చూసి ఆ తేజస్సుని బయటికి వదిలేస్తే దాన్ని రెండు కుండల్లో దాచింది ఊర్వశి.
🌿కొంతకాలం తర్వాత వసిష్ఠుడు మళ్ళీ శరీరాన్ని పొంది అగస్త్యుడితో పాటుగా కుండ నుండి బయటికి వచ్చి 'కంభసంభవుడు' అనే పేరు పొందాడు . నిమి శాపం వల్ల శరీరాన్ని విడిచినా వసిష్ఠుడు కారణజన్ముడు కనుక మళ్ళీ శరీరాన్ని పొందాడు.
🌸ఒకసారి వసిష్ఠుడు కర్దమ ప్రజాపతి ఇంటికొచ్చి అక్కడే వుండగా కర్దముడు తన కూతురు అరుంధతిని మహర్షికి సేవ చేయ్యడానికి పెట్టాడు. వసిష్ఠుడు దివ్య దృష్టితో అరుంధతిని తన భార్య అవుతుందని తెలుసుకొని కర్దముణ్ణి అడిగి పెళ్ళి చేసుకున్నాడు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment