THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, October 4, 2022
మహర్నవమి ....!!
🌸మహిషాసుర సంహారం, అంత సామాన్యం కాదు, మహిషాసురుడు గొప్ప రాక్షసుడు, గొప్ప బలవంతుడు. తన తపః శక్తితో ఎన్నో వరాలు పొందాడు, అతనికున్న వర మహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసింది.
🌿ఆ బలగర్వంతో మూడు లోకాలను జయించి విజయ గర్వంతో తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించసాగాడు. దేవతలను, ఋషులను, మానవులను కౄరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో-బాధతో, మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను ( బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ) రక్షణ కల్పించమని వేడుకున్నారు.
🌸దేవత, ముని, మానవుల వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఓ తేజస్సు ( అంటే ఒక వెలుగు – ఒక శక్తి అని అర్ధం ) పుట్టింది.
🌿దానికి ఒక రూపం ఏర్పడింది, ఆ తరువాత మూడుకోట్ల దేవతల కోపము, ఆవేశము ఈ తేజో రూపంతో కలిసి మరింత శక్తివంతమైన రూపంగా – అదే “ఆదిశక్తి” గా, ”అమ్మ ”గా, స్త్రీ మూర్తిగా ఉద్భవించింది.
🌸ఆమే జగన్మాత అయిన ఆది పరాశక్తి, ఈ రూపాన్నే ”సర్వదేవతా స్వరూపం” అంటారు...
🌿దేవతలందరూ తమతమ శక్తిని, ఆయుధాలను – ” అమ్మ ” కు యిచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, శ్రీమహావిష్ణువు తన చక్రాన్ని, విశ్వకర్మ (ఈయన ఒక దేవత) ఒక పదునైన గొడ్డలిని ( పరశురాముని), ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆదిపరాశక్తికి ఆయుధాలుగా యిచ్చారు.
🌸హిమవంతుడు సింహాన్ని ”తల్లి” కి వాహనంగా సమర్పించాడు, సింహాన్ని వాహనంగా చేసుకొని పైన చెప్పిన ఆయుధాలను తీసుకొని వరుణుడు యిచ్చిన శంఖాన్ని పూరించింది.
ఆ శంఖ నాదశక్తికి తట్టుకోలేక రాక్షసులు తలక్రిందులయ్యారు,
మహిషాసురుడును “అణిమాది అష్టసిద్ధుల” సహాయంతో సింహరూపంలో ” దేవి ” ముందు యుద్ధానికి సిద్ధపడ్డాడు.
🌿ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు, మత్తగజంలా (బలమైన ఏనుగలా ) మారి ”అమ్మ ” ను ముట్టడించబోయాడు., చివరకు తన సహజ రూపమైన దున్నపోతు (అంటే మహిషం ) రూపంలో వాడి కొమ్ములతో ”అమ్మ ” మీద దాడి చేశాడు.
🌸తన త్రిశూలంతో మహిషాసురుడి గుండెలు చీల్చిపారేసింది ఆ జగదాంబ. రాక్షసుడు చచ్చిపోయాడు, ఇది మహిషాసుర సంహార కథ.
🌿1) చండ
🌸2) ముండ
🌿3) శుంభ
🌸4) నిశుంభ
🌿5) దుర్గమాసుర
🌸6) మహిషాసురులు
🌿ఆరుగురు రాక్షసులు – రజో, తమో గుణాలకు ప్రతీకలు. సత్వ గుణానికి అధిదేవత అయిన జగన్మాత ఈ ఆరుగురు రాక్షసుల్ని సంహరించింది.
🌸రజో, తమో గుణాల పైన సత్వ గుణము యొక్క విజయానికి ప్రతీక ఈ జగన్మాత విజయము. మహిషాసురమర్ధిని అమ్మవారు నవరాత్రులు తొమ్మిది అవతారాలలో దర్శనము ఇచ్చారు.
🌿అమ్మ దుష్ట శిక్షణకు త్రిమూర్తుల శక్తీ తో సహస్ర బాహువులతో సకలాభారనాలతో మహిషాసురుని వధించుటకు అమ్మ ఉగ్ర రూపము ధరించారు. అప్పుడు మహిశాసురుడును చంపివేసినది, అప్పుడు ఆమె రౌద్ర రూపాన్ని చూసి దేవతలు అందరు అమెను స్తుతించారు.
🌸అలానే శంకారాచార్యులవారు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పాడారు అది మంచిగా గుర్తింపు ఉన్న పాట.,
నవరాత్రుల తరువాత ఈరొజు మహిషాసుర మర్ధిని స్తోత్రము చదువుతారు.
🌿ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం, అశ్వయుజశుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది.
🌸ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే “మహార్నవమి”గా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగా ఈ రోజు దర్శనం ఇస్తుంది.
🌿మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది.
🌸ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం చేస్తారు. అమ్మవారికి "ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా” అనే మంత్రాన్ని జపించడం మంచిది అని పురాణాల ద్వారా తెలియుచున్నది..స్వస్తి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment