Adsense

Wednesday, October 5, 2022

విజయదశమి ప్రశస్తి....!!

 



🌸విజయదశమి చాలా శుభప్రదమైన దినం. ఆ రోజున కళాకారులు, విద్యార్థులు తమ కొత్త కార్యక్రమాలు ఆరంభించే రోజుగాను, దేవిని పూజించి ఆరాధిస్తారు. విజయదశమి వైభవంగా
జరుపుకొనవలసిన పండుగ.

🌿విశిష్టమైన ఆ పండుగ మహిమ
తెలుసుకుందాము.

🌸కాలరూపిణిగా భావించే అంబికకు సహస్రనామాలలో విజయ అనే పేరు వున్నది. ఆశ్వీయుజ శుక్లపక్ష దశమినాడు అంటే విజయదశమినాటి సాయంకాలం, నక్షత్రాలు కనిపించే సమయానికి విజయ అనే పేరు వున్నది.

🌿ఆ శుభముహూర్తంలో, ఆరంభించే కార్యాలు అన్నీ జయప్రదమవుతాయని
"ముహూర్త చింతామణి" అనే గ్రంధం తెలియ చేస్తున్నది.

🌸దసరా ఉత్సవాలు జరిపేటప్పుడు విజయదశమినాడు  విజయ అనబడే ఆ శుభ ముహూర్త సమయాన్నే బాణము వేయడం జరుగుతుంది.  

🌿జీవితంలో విజయాలు సాధించాలనుకున్నవారు, ఆసమయంలోనే తమ జైత్రయాత్ర ప్రారంభించాలని "రత్నకోశం" అనే గ్రంధం తెలియ చేస్తున్నది.

🌸ఉత్తర దేశ రాష్ట్రాలలో బయలు మైదానంలో జరిపే  "రామలీలా" మహోత్సవంలో రామకధా నాటకానికి ముఖ్యమైన రోజు విజయదశమి.

🌿ఆ రోజున  రాముని పాత్ర ద్వారా బాణాలు వేసి రావణుని, కుంభకర్ణుని, ఇంద్రజిత్ ని సంహరిస్తారు. ఈ ముగ్గురి రూపాలను తయారు చేసి దహనం చేస్తారు. ఈ చర్య దుర్మార్గాన్ని నాశనం చేసి సన్మార్గాన్ని, ధర్మాన్ని నిలబెట్టడం కోసమని తెలియచేస్తున్నది.

🌸శ్రీ రాముడు తొమ్మిది రోజులు శక్తిదేవతని ఆరాధించి పదవ రోజైన విజయదశమినాడు విజయం పొందాడు. ఈ కారణంగానే తరువాత
వచ్చిన రాజులు పదవరోజున ఆయుధ పూజలు చేయడం, శతృవుల మీద దండయాత్ర చేయడం ఆరంభించారు.

🌿ఈ ఆచారాలు యీ విధంగా ప్రారంభమై "దసరా ఉత్సవాలకి" నాంది పలికింది.

🌸చాముండి మాత తొమ్మిది రోజులు మహిషాసురునితో యుధ్ధం చేసి,  పదవరోజైన విజయదశమినాడు మహిషాసురిని సంహరించినదని దేవీమహాత్యం తెలుపుతున్నది.

🌿భండాసురునితో లలితాపరమేశ్వరి తొమ్మిది రోజులు యుధ్ధం చేసి, పదవ రోజు ఆ దానవుని సంహరించి విజయం పొందినదని లలితోపాఖ్యానము తెలియ చేస్తున్నది. దేవి అధర్మాన్ని నాశనం  చేసి ధర్మాన్ని నిలబెట్టినదనడానికి నిదర్శనాలు.

🌸విజయదశమి నాడు మరాఠీవారైన ఛత్రపతి శివాజీ, హిందూ ధర్మాన్ని కాపాడడానికి, భవానీ దేవి ముందు శపధం చేసి బయలుదేరినట్టు చరిత్ర తెలుపుతున్నది.

🌿విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించడం విశిష్టం. మహావిష్ణువు ఆలయాలలో, స్వామి అశ్వవాహనం మీద జమ్మి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం యీనాటికి ఆచారంగా వున్నది.

🌸నవరాత్రులలో ఆఖరి రోజున ముగ్గురు దేవేరులు ఏకమై శివశక్తి రూపమై అనుగ్రహం కటాక్షిస్తున్నది. ఈరోజునే విజయదశమి అని మహాశక్తిగా పూజిస్తున్నారు. శివశక్తులు ఏకమైనందున సర్వ శుభాలు, లభిస్తాయి.

🌿విజయ దశమి నాడు అక్షరాభ్యాసము,  అని బాలలకు విద్య ఆరంభిస్తారు.  ఆనాడు ఆరంభిస్తే పిల్లలు ఉన్నత
విద్యావంతులౌతారని చెప్తారు.
విజయదశమి విజయాలనొసగే రోజు...స్వస్తి.

No comments: