Adsense

Thursday, November 17, 2022

శ్రీవేంకటేశాయ నమః


💝 *శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలోనిప్రతీరోజూ ప్రత్యేకమైనదే.*
💖 *అలా ఈ రోజు “త్రిలోచన గౌరీ వ్రతం” జరుపుకునే రోజుగా పవిత్రతను సంతరించుకున్నది.*
💖 *కార్తీక మాసంలో తదియ తిథి రోజు త్రిలోచనగౌరి వ్రతానికి ప్రత్యేకించబడింది.*
💕 *”వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”*
💞 *వాక్కుకీ, దాని అర్థానికీ అవినాభావ సంబంధముంది. శివపార్వతులు కూడా ఈ వాక్కు,అర్థములాంటివారేనని ఈ శ్లోకం చెబుతున్నది.*
💕 *పార్వతీపరమేశ్వరులను ప్రకృతీపురుషులుగా వర్ణిస్తూ ఉంటారందుకే.*
💕 *ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికీ, అవ్యవస్థకూ, అనాచారానికీ దారి తీస్తుంది. ప్రకృతి నుండి పురుషుడు విడిపోతే “శివం” కాస్తా ‘శవం’ ఔతుంది మరి.ఈ ప్రకృతీపురుషుల కేళీవిలాస ప్రదేశమే కైలాసం.*
💞 *కార్తీకమాసం ఉపాసనా కాలం. కనుక శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటే పాపాలు తీరుతాయి. పాపాలెందుకుతీరాలనే ప్రశ్నకు సమాధానమే శంకరాచార్యులవారి*
*”పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం”*
*ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥~స్తోత్రం.*
💝 *సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు.*
💝 *అంతే కాదు …మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మథుడిని తన మూడోకంటి చేత దహనం చేసినవాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు పార్వతీదేవిది కూడా. అందుకే ఆమెను ‘త్రిలోచన’అని కూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తారు.*
💝*తెల్లవారక ముందే వందలాది సందేశాలుంటాయి కొన్నిగ్రూపుల్లో.*
💖 *ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదకారి అయ్యే “మనం-మన ఆధ్యాత్మికత” పేర ఉన్న సత్సంగంలో అధ్యయనం చేసి, ఆకళింపు చేసుకునేందుకు రోజుకు 3,4 సందేశాలే పెట్టడం జరుగుతుంది. చేరదలుచుకునే వారు 9966870447కి మెసేజ్ పెట్టండి.
❤️ *ఈ సందేశాన్ని అన్ని గ్రూపులకూ ఫార్వార్డ్ చేయండి.*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి.*
💝 *అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే. కనుకనే కార్తీక మాసంలో తిదియనాడు “త్రిలోచనగౌరి వ్రతం” చేస్తారు.*
💖 *ఐతే వ్రతం చేసుకోగానే అమ్మ అనుగ్రహం అప్పణంగా కలుగుతుందనుకుంటే పప్పులో కాలు వేసినట్టే సుమా…!*
💕 *అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని పద్దతులను పాటించక తప్పదు.*
💞 *ఎవరినీ శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఇబ్బంది పెట్టకూడదు. ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. కాగా నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేస్తే ఎన్నెన్ని అలలు వస్తాయో అన్నన్ని పాపాలమూటలు మన పాపాల సంచిలో చేరతాయి.కనుక ఎవరినీ బాధపెట్టకుండా ఉండాలి.*
💓 *”మౌనం"మనస్సును శుద్ధి చేసే ఒకానొక ప్రక్రియ. కనుక సాధ్యమైనంత వరకూ మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి.*
💓 *”స్నానం" దేహాన్ని శుద్ధి చేస్తుంది. కనుక ఉభయ సంధ్యలలో చన్నీటిస్నానం చేయాలి.*
💓 *”ధ్యానం" బుద్దిని శుద్ధి చేస్తుంది. కనుక నిరంతరం మనం ఏపనిచేస్తున్నా ధ్యానస్థితిలో ఉంటూ విధ్యుక్తధర్మాలను నేరవేర్చుకోవాలి. మనపనిని మనమే చేసుకోవాలి. ఎవరిసహాయాన్నీ కోరవద్దు.*
💓 *”దానం":~ మనం ఈ భూమి మీదికి వచ్చేప్పుడు ఏమీతేలేదు. పోయేప్పుడు ఏమీ తీసుకుపోలేం. కనుక దేనిమీద కూడా “నాది” అని బ్రాంతి చెందక సాధ్యమైనంతలో మన సంపాదనలో ఎంతోకొంత సాటి జీవుల శ్రేయస్సుకోసం వెచ్చించాలి.*
💖 *”ఉపవాసం"ఉండాలి. దీని వల్ల ఆరోగ్యశుధ్ధి కలుగుతుంది. కానీ నటననే జీవించడంగా భావిస్తున్న  మనిషి ఈ విషయంలో కూడా పోౙులే కొడుతూ పరమ దరిద్రపు అసహ్యకరమైన అతిశయాన్ని కనబరుస్తూ ఉన్నాడు.*
💓 *”క్షమాపణ":~ఎవరైనా తెలిసీ తెలియకా పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి. తద్వారా మానవ సంబంధాలు బలపడతాయి. పరుల మీద నిరంతరం అసత్యారోపణలతో పైశాచికత్వాన్ని ప్రదర్శించడాన్నే జీవనవిధానంగా మలుచుకుంటూ ఉన్న గోముఖవ్యాఘ్రాల్లో క్షమాగుణాన్ని ఆశించడమంటే కుందేటి కొమ్ములకోసం వెతికినట్లే.*
💝 *పదిమంది గొప్పగా నీ గురించి చెప్పుకోవాలంటే ముందు నీవు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి.*
💝 *నీవు సత్యం వైపు ఉండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.*
💝 *కరుగుతున్న కాలానికీ జరుగుతున్న సమయానికీ అంతరించే వయసుకీ మిగిలే జ్ఞాపకమే “మంచితనం". అదే మనకు ఆభరణం. ఈ “ఆభరణం” ఒక్కటి లేకపోతే బతకడమే వేస్ట్. అలాంటి వాళ్ల పూజలఫలితం “ఏటిలో పిసికిన చింతపండు”.*
💝 *మానవుడిలో “అహం" తగ్గిన రోజున “ఆప్యాయత"అంటే ఏమిటో తెలుస్తుంది. “గర్వం" పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.
నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప “నేనే దేవుణ్ణి” అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించగలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది.*
💝 *నిజానికి ఈ పై సూత్రాలు పాటిస్తే ఏ వ్రతం చేయనక్కరలేదు. సమస్త జీవులలో పరమాత్మను చూడగలిగితే నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం. “అణోరణీయాన్ మహతో మహీయాన్” “సర్వం విష్ణుమయం జగత్”.*
❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*


No comments: