Adsense

Thursday, January 19, 2023

నిజామాబాద్ జిల్లా : సారంగపూర్.. శ్రీ హనుమాన్ దేవాలయం

 నిజామాబాద్ జిల్లా : సారంగపూర్.. శ్రీ హనుమాన్ దేవాలయం


💠 నిజామాబాద్కు 8 కి.మీ. దూరంలో వున్న అతిపెద్ద ఆంజనేయస్వామి ఆలయాన్ని ఛత్రపతి శివాజీ గురువైన సమర్త రామదాసు కట్టించారని స్థాని సమాచారం.

💠 ఎంతో పురాతనమైన ఈ ఆలయం పూర్తిగా రాతి నిర్మితం, మరో విశేషం ఏంటి అంటే ఈ ఆలయంలోని హనుమంతుడి విగ్రహం స్వయంగా సమర్థ రామదాసు స్వామి వారు తన స్వహస్తాలతో రూపొందించారని చరిత్ర చెబుతుంది....

💠 హనుమంతుని ఆలయ ప్రాంగణం 1400 ఎకరాలలో విస్తరించి ఉంది మరియు సుందరమైన మరియు ప్రశాంతమైన కొండపై ఉంది.

💠 నేలకు కొంత ఎత్తున కల పెద్ద ఏక శిల మీద హనుమంతుడి మూర్తి రూపొందించబడింది, ఇక్కడే కొండ మీద సమర్థ రామదాసుల వారు రోజు సూర్యనమస్కార సాధన చేసేవారు అని , ఇక్కడి నుంచే చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాల్లో హనుమాన్ ఆలయాల స్థాపన చేశారని తెలుస్తుంది....

💠 ఈ రోజుకి కూడా స్వామి సమర్ధుల వారి శిష్య పరంపర ఆధ్వర్యంలోనే ఈ ఆలయ నిర్వహణ సాగుతుంది

💠 చక్కని ప్రకృతి మద్యలో మంచి ఎత్తులో వుండే ఈ ఆలయం భక్తులను పారవశ్యానికి గురిచేస్తుంది....

💠 ప్రత్యేకంగా ఇక్కడ ఎంతో మంది సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తూ వుంటారు,వాటి కోసం మంచి వ్యవస్థ పెద్ద హాల్, భోజన మండపాలు విశాలమైన ప్రాంగణం ఉంటుంది.

💠 ఆలయానికి ఎదురుగా గోశాల కూడా నిర్వహించబడుతుంది...

💠 ప్రతీ శని,మంగళ వారాల్లో వందలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ వుంటారు...

💠 ఇందూరు ప్రజల గుండె ధైర్యం సారంగాపూర్ హనుమాన్ మందిరం, కోరి మొక్కిన భక్తుల ఆపద్బాంధవుడిగా ఈ హనుమంతుడు పేరుగాంచాడు....

💠 ఈ ఆలయ నిర్మాణం ,ఆలయం లో ఉన్న ఉపాలయాలు కూడా చాలా అద్బుతంగా నిర్మించడం జరిగింది .
స్వామి వారు చాల మహిమన్మితులు ,కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం .
ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ,శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది .

💠 ఇందూరు హిందువులందరు ,ఇందూరు వచ్చే వాళ్ళందరూ ఒక్కసారైనా సందర్శించాల్సిన మహిమాన్విత ఆలయం సారంగపూర్ హనుమాన్ మందిరం

No comments: