Adsense

Thursday, January 19, 2023

అరుణాచలం క్షేత్రంలో ఉన్న అరుణాచలం కొండ శ్రీ అరుణాచలేశ్వరుడు గురించి తెలుసుకుందాం...



అఋణచలం... ఈ పదాన్ని విడదీస్తే...

"అ" "ఋణ" "అచలం"...

అంటే అర్థం ఏమిటి...

ఇది అర్థం చేసుకోవాలి అంటే ముందు ఒక ఉదాహరణ చూడండి...👇



అ "సత్యం"...అంటే

సత్యం అనే పదం ముందు "అ" అనే అక్షరం పెట్టాం...

అప్పుడు అసత్యం అనే పదం ఏర్పడింది...

"అ" అనే అక్షరం పెట్టడం వల్ల దాని పక్కన ఉన్న "సత్యం" అనే *పదం లేదు*

అంటే సత్యం లేదు అని అర్థం వస్తుంది...

అసత్యం అంటే ఏమిటి సత్యం లేనిది అని అర్థం... మనందరికీ తెలుసు ఈ విషయం...

@@@

ఇప్పుడు...

"అ" "ఋణ" "అచలం"...

గురించి తెలుసుకుందాం...

అచలం అంటే కొండ అని అర్థం...

ఇక్కడ మీరు గమనిస్తే "అ" అనే అక్షరం "ఋణ" అనే పదం ముందు వుంది...

పైన ఉదాహరణ ప్రకారం "ఋణ" అనే పదం ఉండదు అంటే

*అ "ఋణ" అంటే ఋణం లేదు అని అర్థం వస్తుంది...*

*ఋణం వలన మాత్రమే జీవుడికి జన్మలు వస్తాయి* ...

అది పుణ్య ఋణం కావచ్చు పాప ఋణం కావచ్చు...

పుణ్య ఋణం వలన *సుఖం* వస్తుంది...

పాప ఋణం వలన *దుఃఖం* వస్తుంది...

*అ "ఋణ" చలం... పుణ్య ఋణం లేకుండా చేసేస్తుంది మరియు పాప ఋణం లేకుండా చేసేస్తుంది...*

పుణ్యం,పాపం ఉంటేనే జీవుడు జన్మ తీసుకుంటాడు పుణ్యం వలన సుఖం అనుభవించడానికి పాపం వలన దుఃఖం అనుభవించడానికి...

అరుణాచల కొండగా ఉన్న శ్రీ అరుణాచలేశ్వరుడు పుణ్యం పాపాన్ని లేకుండా చేస్తాడు ప్రతి జీవుడికి...

*పుణ్యం,పాపం లేకపోతే జన్మ ఉండదు అంటే మోక్షం వస్తుంది అని అర్థం...*

*స్మరణత్ అరుణాచలే*

స్మరిస్తే మోక్షం ఇస్తుంది అని అందుకనే అన్నారు...

అందువలన ప్రతి ఒక్కరూ వారి జన్మ వృధా చేసుకోకుండా...

ఒక్కసారి అరుణాచల క్షేత్రానికి వెళ్లి అరుణాచలం కొండని దర్శనం చేసుకుని మనసులోనూ బుద్ధిలోనూ అది పరిపూర్ణంగా ఉండేటట్టు చూసుకొని గుర్తుపెట్టుకుని...

మరియు అరుణాచల క్షేత్రంలో ఉన్న శ్రీ అపితకుచాంబ అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని మనసులోనూ బుద్ధిలోనూ అది పరిపూర్ణంగా గుర్తు ఉండేటట్లుగా చూసుకుని అరుణాచల యాత్ర ముగించుకుని వారి వారి గృహములకు వచ్చిన తర్వాత...

*త్రికరణ శుద్ధితో ప్రతిరోజు శ్రీ అరుణాచల శివ అని నామాన్ని జపిస్తూ మనసులో ఆ కొండని మనసులో ఆ దేవాలయాన్ని తలుచుకోగలిగితే చాలు...*

*స్మరణత్ అరుణాచలే*

*ప్రతి జీవుడికి మోక్షం కచ్చితంగా వచ్చి తీరుతుంది...*

జీవుడికి ఇదే చివరి జన్మ అవుతుంది...

శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు శ్రీ అరుణాచల వైభవం అనే ప్రవచనంలో...


దయచేసి అందరూ అరుణాచల క్షేత్రం వెళ్ళండి...

మానవ జన్మని వృధా చేసుకోకండి... మీ వీలు చూసుకుని కచ్చితంగా శ్రీ అరుణాచల క్షేత్రం వెళ్లండి..

No comments: