Adsense

Thursday, February 9, 2023

మాఘ పూర్ణిమ

మాఘ పూర్ణిమ

ఈరోజు ఫిబ్రవరి 5న ఉదయతిథి ప్రకారం మాఘ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 7.07 నుండి మధ్యాహ్నం 12.13 గంటల వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది, ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా, మాఘ పూర్ణిమ ఈసారి పుష్యమి నక్షత్రంలో వస్తుంది మరియు ఈ నక్షత్రం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున, శుభ సమయంలో స్నానం చేస్తే, ఆ వ్యక్తి దాని శుభ ఫలాన్ని పొందుతాడు.

నక్షత్ర మండల మార్గాన్ని అనుసరించి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ మార్గంలో లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. సదరు మార్గాన్ని మన పూర్వీకులు ఇరవై ఏడు  భాగాలుగా విభజించారు. అవి దాదాపు సమానంగా ఉంటాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ భాగంలో ఎక్కువ కాంతివంతంగా ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ భాగానికి పేరు పెట్టారు. ఇరవై ఏడు నక్షత్రాలలో మఘ ఒకటి. అందులో ఐదు ప్రముఖ నక్షత్రాలు పల్లకి ఆకారంలో చెదరి ఉంటాయి. మాసానికి ఒకసారి చంద్రుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. కాని ఏడాదిలో ఒకేసారి చంద్రుడు పదహారు కళలతో  మఘ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అదే మాఘ పూర్ణిమ. దానినే మహామాఘి అంటారు.

పూర్ణిమలలొకెల్ల మాఘమాసం లో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ , వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృస్ట మైనవి . ఆ పూర్ణిమలలో చేసే దేవతారాధన మరింత శ్రేస్టమయినది .

మాఘమాసం సూర్యసంబంధమైన అర్చనామాసం. ఈసంవత్సరం మాఘ మాసంలో పూర్ణిమ ఆదివారం ఈ రోజు (5/2/23) వచ్చింది చాలా పవిత్రమైనది. ఈ రోజున తలస్నానం చేసి, సూర్యభగవానుడికి నమస్కరించాలి. ఆదిత్యహృదయం, సూర్యాష్టకం వంటివి చదవాలి....ఫలితం చాలా అమోఘం...
జై గురుదేవ్..

No comments: