Adsense

Friday, March 3, 2023

పట్టాభి రామునకు పండెండు వాహనాలు సిద్దం

పట్టాభి రామునకు పండెండు వాహనాలు సిద్దం

🚩అష్ఠైశ్వర్యమోనర్చు అయోద్యరాజునకు గజవాహనం

🚩భోగభాగ్యాలోనర్చు వైకుంఠరామునకు శేషవాహనం


🚩మనసుమాలిన్యాలు తోలగించు సత్పురుషునకు చంద్రప్రభ వాహనం

🚩జ్ఞానాన్ని ప్రసాదించు అశ్వ వదునుడుకు అశ్వవాహనం


🚩భయాలు తోలగించు
అభయప్రదాతకు సింహవాహనం

🚩మోక్షాన్ని ప్రసాదించు మోక్షారామునకు గరుడవాహనం

🚩సద్గుణం ప్రసాదించు  సకలగుణాభిరామునకు  హంసవాహనం

🚩ఆయురారోగ్యం ప్రసాదించు ఆదిత్యరామునకు సూర్యప్రభ వాహనం


🚩సకలశుభాలోనర్చు పట్టాభిరామునకు సింహాసనం

🚩కోరినకోర్కెలుతీర్చు కోదండరామునకు కల్పవ్రుక్షవాహనం

🚩ఆపదలో ఆదుకునే ఆపద్భాందవునకు ఆంజనేయవాహనం

🚩కలిపాపంను హరించు భద్రాచల రామునకు సార్వభౌమవాహనం

🌿కలియుగ వైకుంఠం, దక్షిణ అయోద్య, భద్రాచలంలో కోలువై ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని ఉత్సవాల సేవకై

🌸భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం-భక్త సమాజం NRI వాసవీ అసోసియేషన్ వారు 12 స్వర్ణ పూత వాహనాలు అందించిన విషయం అందరికీ విదితమే.

🌿శ్రీ భద్రాచలశ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి భక్తగ్రేశ్వరుడు శ్రీ రామదాసు గారు,350సంవత్సరాక్రితం చేయించిన వాహనాలకు

🌸ప్రత్యామ్నాయం గా, కొత్తగా, NRI, (USA)వారు 75లక్షల విలువైన నూతన సువర్ణ ద్వాదశ దివ్యమైన వాహనాలను బహుకరించారు

🌿. కాలం చెల్లిన అప్పటి రామదాసుగారు చేయించిన వాహనాలను భక్తుల సందర్శనార్థం ఆలయ పరిసరాలలో ప్రదర్శించనున్నారు.
..

No comments: