Adsense

Wednesday, March 29, 2023

శ్రీ సహస్ర లక్ష్మీశ్వరాలయం




🌿తమిళనాడు లోని పుదుక్కోట్టై జిల్లా అరంతాంగి ఆవుడైయారు ఆలయానికి పది కి.మీ దూరంలో వున్న తీయత్తురు లో యీ ఆలయం వెలసివున్నది.

🌸కొన్ని శతాబ్దాల క్రితం యీ ప్రాంతమంతా దట్టమైన కీకారణ్యాలతో , అడవుల తో నిండి వుండేది ఈ మార్గం గుండా, ఒక మునీశ్వరుడు రామేశ్వరానికి పయనమై వెళ్ళేడు.

🌸శివుడిని అభిషేకించవలసిన సమయం అవడంతో, ఏమి చేయాలా అని యోచనలో పడ్డాడు. అప్పుడు
అక్కడ అతనికి ఒక స్వయంభూ శివలింగం కనపడింది.
మునికి మహదా నందం కలిగింది.

🌿ఆ ముని అక్కడే వున్న ఏటి తీరాన శివలింగాన్ని,ప్రతిష్టించి పూజలు చేసి
ఆరాధించాడు. అదే సమయాన ఆకాశ మార్గాన పయనిస్తున్న బ్రహ్మదేవుడు ,  అగ్ని భగవానుడు, సూర్యభగవానుడు కూడా భూమి కి దిగి వచ్చి,  యీ ఈశ్వరుడిని అర్చించి ఆయన అనుగ్రహం పొందారు.

🌸అగ్ని, సూర్యభగవానులిద్దరూ  పూజించిన స్ధలం కావడం వలన యీ ఊరికి, తీయత్తూరు అనే పేరు
వచ్చింది. ఈ వివరాలు
లింగ పురాణంలో విశదీకరించబడి వున్నాయి. 

🌿ముగ్గురు అమ్మలలో ఒకరైన
శ్రీ మహాలక్ష్మీకి సిరిసంపదలకు అధిదేవతయై శ్రీ మహావిష్ణువుకు
అర్ధాంగియై, ఆయన వక్షస్ధల నివాసిని కావాలని గాఢంగా  వాంఛించింది.

🌸 అందుకోసమై లక్ష్మీదేవి తపోనిష్టాగరిస్టులైన ,కార్జనీయమహర్షిని అగస్త్య మహర్షిని , తన కోరిక నెరవేరే మార్గం చెప్పమని సలహా కోరింది.

🌿ఆ మునీశ్వరులు భూలోకంలోని తీయత్తూరు ఏటి ఒడ్డున వెలసి
వున్న స్వయంభూ శివలింగాన్ని తామరపుష్పాలతో, అభిషేకించి ,
పూజించి, అర్చిస్తే శ్రీ మహావిష్ణువుకు
అర్ధాంగియై,ఆయన వక్షస్ధలవాసినివి కాగలవని , ఆమె పూజించే వారందరికీ కి ,సకల సిరిసంపదలు అనుగ్రహించే శక్తిని పొందవచ్చని సలహా  చెప్పారు.

🌸వెంటనే మహాలక్ష్మి తీయత్తూరు వచ్చి, ఋషులు చెప్పినట్లుగానే వేయి తామరపుష్పాలతో, ఈశ్వరుని పూజించి, ఆరాధించింది.

🌿శ్రీ మహాలక్ష్మీ  చే ఆరాధించబడిన
శివుడైనందున యీ క్షేత్రంలోని  ఈశ్వరునికి , శ్రీ సహస్రలక్ష్మీశ్వరుడు
అనే పేరు వచ్చింది.

🌸మహాలక్ష్మి  యీ ఈశ్వరుని అర్చించి, ఆ మహేశ్వరుని కరుణతో శ్రీ మహావిష్ణువు కి అర్ధాంగి కావడమే కాకుండా, తనని పూజించి, సేవించిన వారికి, సిరిసంపదలు ,అనుగ్రహించే వరాలు కూడా  పొందినది.

🌿అందువలన తీయత్తూరులోని
శ్రీ సహస్ర లక్ష్మీశ్వరుని పూజించి, ఆరాధిస్తే, సకలైశ్వర్యాలు
కలుగుతాయని భక్తుల విశ్వాసం.

🌸శ్రీ రాముడు‌, లక్ష్మణుని తో కలసి సీతాదేవిని వెతుకుతూ యీ స్ధలమునకు వచ్చి, ఈశ్వరుని అర్చించినట్లు యిక్కడి స్ధల పురాణంగా పేర్కొంటారు.

🌿ఇక్కడ వున్న ఈశ్వరుని ఆరాధించి
అనేక లాభాలు పొందిన భక్తులంతా కలసి ఒక ఆలయమును నిర్మించారు.

🌸అశరీరవాణి  ఆదేశం ప్రకారం, అమ్మవారికి, ప్రత్యేక మండపం నిర్మించి అందులో  పెరియ నాయకి అనే పేరుతో అమ్మవారిని ప్రతిష్టించారు.

🌿సకల హోమాలకు అధిపతి  అంగీరస మహర్షి. ఈయనే ప్రప్రథమంగా, సూర్యుడు, చంద్రుడు, అగ్నుల ప్రకాశ శక్తిని  తీసుకుని, ఒక బ్రహ్మాండమైన, హోమాన్ని, యీ తీయత్తూరు స్ధలంలోనే జరిపాడు.

🌸తీరని కలహాలు , శతృ భయం , అప్పులు, మనోవేదనలతో  బాధపడేవారు,  తీయత్తూర్ సహస్రలక్ష్మీశ్వరునికి సాంబ్రాణి
ధూపం వేసి పూజలు నిర్వహిస్తే వారి
సకల బాధలు తొలగిపోతాయి.

🌿అలాగే , సిరి సంపదలు , ఆస్తులు కోల్పోయి, వ్యాపారనష్టములు కలిగి, లావాదేవీలతో ములిగినవారు
ఈ  యీశ్వరునికి స్వయంగా చందనాన్ని, అరగదీసి, పూసి ఆరాధిస్తే , కోల్పోయిన సిరిసంపదలు తిరిగి
లభిస్తాయని, భక్తుల విశ్వాసం...స్వస్తి..

No comments: