Adsense

Wednesday, March 29, 2023

ఆడవాళ్లు వేసుకునే జడ వల్ల లాభాలు సంప్రదాయాలు...



చదవండి,ఆడవాళ్లు వేసుకొనే కొప్పు, ఒకజడ ,రెండుజడలవెనుక, ఆంతర్యమేమిటి,దేనికి సంకేతాలు?



🌿మన సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహార  శాస్త్రంలో చెప్పబడినట్టుగా కొన్ని సంకేత రూపముగా... స్త్రీలకు ప్రత్యేక ఆచార కట్టుబాట్లు పెట్టారు.

🌸1) అమ్మాయి రెండు జడలు వేసుకుంటుందీ అంటే (చిన్నపిల్లలు ,యుక్తవయసు బాలికలు ) ఇంకా పెళ్లి_కాలేదూ అని అర్ధం  అంటే జీవేశ్వర సంభంధం ఇరువురిగా ఉన్నారు,

🌿ఇంకా ఒక్కటిగా కాలేదు, వివాహం కాలేదు అని అర్ధం . స్వేచ్ఛగా విహరిస్తుంది ,ఆనందంగా ఉంది అని చెబుతారు .

🌸2) ఏ అమ్మాయైతే ఒక జడ వేసుకుంటుందో ఆమెకు వివాహం_జరిగిపోయింది అని భావం....

🌿ఇక్కడ రెండు జడలు ఒక్కటి అవడం ...ఒక్కటి అవడం అంటే రెండు జడలే ఉంటాయా.. కాదు,
మూడుగా త్రివేణీ సంగమంగా (వేణీ అంటే తమిళపాదం లో జడ ) చెబుతారు ,మూడు పాయలుగా అల్లుకుని ఉంటేనే ఒక జడ అల్లడానికి వీలవుతుంది.

🌸మూడూ అంటే 1) నేనూ 2) భర్త 3) సంతానం (కావచ్చు ,కాకపోవచ్చు ) అనేభావం ,అలాగే జీవుడు ,ఈశ్వరుడు ,ప్రకృతీ ,మాయ మొహం అని అర్ధం . సత్వ ,రజో ,తమో గుణాలుగా ఉంటాయని అర్ధం .

🌿3) ఒకవేళ జడ ముడిసి కట్టుగా (కొప్పు ) కట్టారో... అంటే వివాహిత స్త్రీ అయ్యి ఉండి,సంతానం కలిగి ఉంది అని అర్ధం.అన్నీ బాధ్యలతో కలిపి గుట్టుగా ముడుచుకుని ఉందనీ అర్ధం

🌸ఇలాగ వారి
రూపురేఖలలో ,ఆహార్యంలో ,వేష భూషణలో చూచి మనం తెలుసుకొనవచ్చును .

🌿వీళ్ళేమిటీ అని చూడగానే తెలిసిపోతుంది .వేసుకునే జడలను బట్టివారి శారీరక స్థితిని తెలియజేస్తాయి .ఇదంతా కూడా ఆచార ధర్మంలో ఉంది,ఆచారం క్రిందే వస్తాయి .

🌸నాగరికత తెలిసినవాళ్ళు జుట్టు తప్పనిసరి సరియైన పద్దతిలో ఎదో ఒక రకముగా అందముగా తీర్చి దిద్దుకుంటారు .

🌿కానీ ఇప్పుడు మోడనైజేషన్ ముసుగులో అభివృద్ధి ,ఆధునికత పేరుతో ప్రాశ్చాత్త్యా పోకడలతో విషసంస్కృతిని దిగుమతి చేసుకొని, మన ఆచారాలను మంట గలుపుతున్నారు

🌸చిన్నపిల్లల నుండి పండు ముదుసలి వరకు కొందరు స్త్రీలు వివిధరకాల ఫాషన్ కట్టింగులు చేయించుకుంటున్నారు.

🌿కొందరు మహాతల్లులు చదువులు ఉద్యోగాలవేటలో భాగంగా  ,జుత్తు విరబోసుకొని శక్తి రూపాలుగా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తిరుగుతున్నారు.

🌸ఎక్కడ స్త్రీ జుట్టు ముడవకుండా విరబోసుకొని విహరిస్తుందో వారి వెనుకాల భూత, ప్రేత, పిశాచాలు,,పాతకులు లంకిణిలు పూతనలు తిరుగుతాయని.

🌿ఇది నిక్కచ్చిగా రాక్షస స్వభావమే ననీ ధర్మ_ప్రభోధం .
శాస్త్రం ప్రకారం స్త్రీలు తలంటి బోసుకున్నాక జట్టు ఆరబెట్టుకోవడానికి కూడా కొసరి భాగాన ముడివేసి ఆరబెట్టుకోవాలి .

🌸కానీ కొన్ని పురాణగాధల్లోవాళ్ళు చేసిన శబధం మేరకు వారి జుట్టు విరబోసుకున్నట్టు చెబుతారు,
రామాయణంలో సీతామాత వల్ల లంకాదహనమే జరిగింది ,

🌿భారతంలో ద్రౌపదీ కారణంగా మహాభారత యుద్ధమే సంభవించింది,అయినా కూడా అది అనర్ధదాయకమే అయ్యింది .

🌸ఇవి నాకు పురాణ శాస్త్రాలు ద్వారా తెలిసిన వివరాలు మాత్రమే తెలుపుతున్న...స్వస్తీ..

No comments: