THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Thursday, March 23, 2023
బాలేందు వ్రతము
🌿చైత్ర శుక్ల ద్వితీయ రోజున
బాలేందువ్రతాచరణ చేయవలెను.
ఈ వ్రతాచరణము వలన స్త్రీలు
సౌభాగ్యమును మరియు పుత్ర
సంతానమును పొందుదురు.
🌸ఈ రోజున ఉపవాసము చేసి
సాయంకాలము చంద్ర దర్శనము
చేసుకొని చంద్రాంతర్యామియైన
అమృత కలశధారీ ధన్వంతరిని
పూజించవలెను.
🌿సాయంకాలము
స్నానము చేసి పిండితో
బాలచంద్రుని చేసి ఆ పిష్టములో
చంద్రుని, ఆ చంద్రాంతర్యామి
ధన్వంతరిని ఆవాహన చేసి తెల్ల
పుష్పములతో పూజించి,
నూలుపోగు సమర్పించి,
🌸పరమాన్నమును, నూనెతో
తయారుచేసిన పదార్థములను
నైవేద్యము చేయవలెను. ఈ
ప్రతమువలన రోగరుజినముల
బాధ తప్పుతుంది. బాలేందు
వ్రతము చేయువారు ఒక
సంవత్సరము వరకు నూనెతో
చేయబడిన పదార్థములను
ఆరగించరాదు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment