THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Thursday, March 23, 2023
శుభాలనిచ్చే ఆలయ తీర్ధాలు...!!
🌿ప్రపంచంలో సకల ప్రాణులకు జలమే జీవాధారం.
అందుకే జలాన్ని తీర్ధం అని ఉన్నతంగా కీర్తిస్తారు.
🌸బీజలం ప్రమేయం లేకుండా ఏవిధమైన ఉత్సవంగాని, వైభవంగాని, ఆలయాలలో జరుగవు.
దేవతలు తలపెట్టినా కూడా మొదట తీర్ధం (పుష్కరిణి) ఏర్పాటు
చేస్తారు. పిదప పూజలు, తపస్సు ఆరంభిస్తారు.
🌸కలశాలలో నీటిని నింపి అందులోనికి దైవాన్ని ఆవాహన చేసి
ఆరాధిస్తున్నాము. తీర్ధపుష్కరిణులు పవిత్రమైనవిగా య్పుణ్యాన్నిచ్చేవిగా పూజించబడుతున్నవి.
🌿ఆవిధంగా చిదంబరం ఆలయంలోని ప్రసిధ్ధిపొందిన
పుష్కరిణి శివగంగ తీర్ధంలో పది తీర్ధాలు వచ్చి చేరి ఆ పుష్కరిణి కి ఎంతో పవిత్రతని కలిగిస్తున్నాయి.
🌷శివగంగ.:🌷
🌸తీర్ధం అంటే శివగంగయే..అని పరమభక్తుడైన కుమారగురు
కీర్తించిన తీర్ధం యిది.
ఈ తీర్ధంతోనే మొదట నటరాజస్వామి కి అభిషేకం జరిగాక, తిరిగి ఆ జలాలు శివగంగ పుష్కరిణి లోనే కలుస్తున్నవి
🌿నటరాజస్వామి తాండవం దర్శించడానికే
పతంజలి మహర్షిగా అవతరించినవాడు ఆదిశేషువు. అటువంటి పతంజలి మహర్షితో కలసి తపస్సు చేసిన వాడు వ్యాఘ్రపాద మహర్షి.
🌸వారిరువురు చిదంబరంలోనే అపురూపమైన నటరాజస్వామి తాండవం దర్శించి అక్కడే సుస్థిర వాసం ఏర్పర్చుకున్నారు.
🌷కుష్టు వ్యాధితో🌷
🌸బాధపడుతున్న గౌడదేశ మహారాజు సింహవర్మకి శివగంగ స్నానమాచరించి పూజలుచేస్తే వ్యాధి గుణమౌతుందని అదే దివ్య ఔషధమని పతంజలిమహర్షి, వ్యాఘ్రపాద మహర్షి
ఉపదేశించారు.
🌸వారి ఆదేశాన్ని పాటించి సింహవర్మ సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు.
అందుకు కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో ఆలయ గర్భగుడి కి బంగారు కప్పును నిర్మింపజేసాడు.
🌿వ్యాధులను గుణపరిచే
మహిమాన్విత తీర్ధం శివగంగ తీర్ధం.
పుష్యమాసం పుష్యమీ నక్షత్రం నాడు , గ్రహణకాలాలో, విశేష ఉత్సవాల రోజులలో శివగంగ పుష్కరిణి పశ్చిమదిశ గుండా నటరాజస్వామి వచ్చి భక్తులందరికి దర్శనమిచ్చి
తీర్ధాన్ని ప్రసాదంగా అనుగ్రహిస్తాడు .
🌸ఈ పుష్కరిణి వద్ద చేసే
పితృ తర్పణాలు అత్యంత పవిత్రమైనవి.
🌷పరమానంద కూపం...🌷
🌿నటరాజస్వామి తాండవం చేసి దర్శనమిచ్చిన సమయంలో, పతంజలి మహర్షి " స్వామీ..మీరు యీ ఆలయంలో సదా
తాండవం చేస్తూనే వుండాలి.
🌸అని వరం కోరారు. అంగీకారించిన
పరమేశ్వరుడు యీనాటికి తాండవ దర్శన భాగ్యం కలిగిస్తూవున్నాడు.
🌿పతంజలి మహర్షి పతంజలి సూక్తం 🌿అనే ఉన్నతమైన పూజా విధానాన్ని ఏర్పరిచి ఆవిధంగానే నటరాజస్వామి కి పూజలు జరిగేలా ఏర్పాట్లు చేశాడు.
🌸నటరాజస్వామి అభిషేకానికి కాశీలోని గంగే అంతర్వాహినిగా
భూమికి అడుగునుండి కాశీ నుండి చిదంబరానికి
ప్రవహించేలా ఏర్పాట్లు చేశాడు.
🌸 అక్కడ నుండే
నిత్యాభిషేకానికి , సంవత్సరంలోని 6 విశేష ఉత్సవాలకి తీర్ధాన్ని తీసుకువస్తారు.
🌿పరమానంద తాండవం
చేసే నటరాజస్వామి కి అభిషేక జలం తీస్తున్నందున ఆ తీర్ధానికి పరమానంద తీర్ధం అని, పరమానంద కూపమని పేరు వచ్చింది.
🌸యూపరమానంద కూపము నుండి తీసుకున్న అభిషేక జలం అభిషేకం చేసిన పిదప ఆ తీర్ధం మన శిరస్సులపై జల్లుకొనడం తెలియని అనుభూతిని
ఆనందాన్ని యిస్తుంది...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment