Adsense

Showing posts with label Alaya thirdalu. Show all posts
Showing posts with label Alaya thirdalu. Show all posts

Thursday, March 23, 2023

శుభాలనిచ్చే ఆలయ తీర్ధాలు...!!


🌿ప్రపంచంలో సకల ప్రాణులకు జలమే జీవాధారం.
అందుకే జలాన్ని తీర్ధం అని ఉన్నతంగా కీర్తిస్తారు.

🌸బీజలం  ప్రమేయం లేకుండా ఏవిధమైన ఉత్సవంగాని,  వైభవంగాని, ఆలయాలలో జరుగవు.
దేవతలు తలపెట్టినా కూడా మొదట తీర్ధం (పుష్కరిణి) ఏర్పాటు
చేస్తారు. పిదప పూజలు, తపస్సు ఆరంభిస్తారు.

🌸కలశాలలో  నీటిని నింపి అందులోనికి దైవాన్ని ఆవాహన చేసి
ఆరాధిస్తున్నాము. తీర్ధపుష్కరిణులు పవిత్రమైనవిగా య్పుణ్యాన్నిచ్చేవిగా  పూజించబడుతున్నవి.

🌿ఆవిధంగా చిదంబరం ఆలయంలోని ప్రసిధ్ధిపొందిన
పుష్కరిణి శివగంగ తీర్ధంలో  పది తీర్ధాలు  వచ్చి చేరి  ఆ పుష్కరిణి కి ఎంతో పవిత్రతని కలిగిస్తున్నాయి.

🌷శివగంగ.:🌷

🌸తీర్ధం అంటే శివగంగయే..అని పరమభక్తుడైన కుమారగురు
కీర్తించిన తీర్ధం యిది.
ఈ తీర్ధంతోనే మొదట నటరాజస్వామి కి అభిషేకం జరిగాక,  తిరిగి  ఆ జలాలు శివగంగ పుష్కరిణి లోనే కలుస్తున్నవి

🌿నటరాజస్వామి తాండవం దర్శించడానికే
పతంజలి మహర్షిగా అవతరించినవాడు ఆదిశేషువు.  అటువంటి పతంజలి మహర్షితో కలసి తపస్సు చేసిన వాడు వ్యాఘ్రపాద మహర్షి. 

🌸వారిరువురు చిదంబరంలోనే అపురూపమైన నటరాజస్వామి తాండవం దర్శించి అక్కడే సుస్థిర వాసం ఏర్పర్చుకున్నారు.

🌷కుష్టు వ్యాధితో🌷

🌸బాధపడుతున్న గౌడదేశ మహారాజు సింహవర్మకి శివగంగ  స్నానమాచరించి పూజలుచేస్తే వ్యాధి గుణమౌతుందని అదే దివ్య ఔషధమని  పతంజలిమహర్షి, వ్యాఘ్రపాద మహర్షి
ఉపదేశించారు.

🌸వారి ఆదేశాన్ని పాటించి సింహవర్మ సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు.
అందుకు కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో ఆలయ గర్భగుడి కి బంగారు కప్పును నిర్మింపజేసాడు.

🌿వ్యాధులను గుణపరిచే
మహిమాన్విత తీర్ధం శివగంగ తీర్ధం.
పుష్యమాసం పుష్యమీ నక్షత్రం నాడు , గ్రహణకాలాలో, విశేష ఉత్సవాల రోజులలో శివగంగ  పుష్కరిణి పశ్చిమదిశ గుండా నటరాజస్వామి  వచ్చి భక్తులందరికి దర్శనమిచ్చి
తీర్ధాన్ని ప్రసాదంగా అనుగ్రహిస్తాడు .

🌸ఈ పుష్కరిణి వద్ద చేసే
పితృ తర్పణాలు అత్యంత పవిత్రమైనవి.

🌷పరమానంద కూపం...🌷

🌿నటరాజస్వామి తాండవం చేసి దర్శనమిచ్చిన సమయంలో, పతంజలి మహర్షి " స్వామీ..మీరు యీ ఆలయంలో సదా
తాండవం  చేస్తూనే వుండాలి. 

🌸అని వరం కోరారు. అంగీకారించిన
పరమేశ్వరుడు  యీనాటికి తాండవ దర్శన భాగ్యం  కలిగిస్తూవున్నాడు.

🌿పతంజలి మహర్షి పతంజలి సూక్తం 🌿అనే ఉన్నతమైన పూజా విధానాన్ని ఏర్పరిచి ఆవిధంగానే నటరాజస్వామి కి పూజలు జరిగేలా ఏర్పాట్లు చేశాడు. 

🌸నటరాజస్వామి అభిషేకానికి కాశీలోని గంగే అంతర్వాహినిగా
భూమికి అడుగునుండి కాశీ నుండి చిదంబరానికి
ప్రవహించేలా ఏర్పాట్లు చేశాడు. 

🌸 అక్కడ నుండే
నిత్యాభిషేకానికి , సంవత్సరంలోని  6 విశేష ఉత్సవాలకి తీర్ధాన్ని తీసుకువస్తారు.

🌿పరమానంద తాండవం
చేసే నటరాజస్వామి కి  అభిషేక జలం  తీస్తున్నందున ఆ తీర్ధానికి పరమానంద తీర్ధం అని, పరమానంద కూపమని  పేరు వచ్చింది.

🌸యూపరమానంద కూపము నుండి తీసుకున్న అభిషేక జలం అభిషేకం చేసిన పిదప ఆ తీర్ధం  మన శిరస్సులపై జల్లుకొనడం తెలియని అనుభూతిని
ఆనందాన్ని యిస్తుంది...