THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, March 28, 2023
భద్రాచలం లో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం గురించి...!!
🌿భద్రుడు అనే ఋషి,,, శ్రీ రాముడిని,, ఒక వరం అడిగాడు.
🌸అసలు భద్రుడు,,, ఎవరు అంటే... మేరు పర్వత రాజుకి 2 కొడుకులు.
రత్నుడు,,,,భద్రుడు,,,,
🌿ఇద్దరూ విష్ణు భక్త్తులు.,,ముక్తి పొంది పర్వతాలుగా,,, మారారు,,,,
రత్నుడు అన్నవరం లో రత్నగిరిగా ,,,, భద్రుడు భద్రాచలం లో " భద్రగిరి' గా మారారు).
🌸ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి.,,, దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను.,,, తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట.,,,
🌿కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు.
🌸అది తెలిసిన భద్రుడు ఘోరతపస్సు చేయటంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు,,
🌿అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం,విల్లుతో పాటు విష్ణువు చేతిలో వుండే శంఖచక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే లక్ష్మణుడు ఎడమవైపున నిల్చొన్నట్లు పురాణాలను బట్టి తెలుస్తుంది.
🌸అందుకే భద్రాచలం లో మూల విగ్రహం ఎక్కడా లేని విధంగా వుంటుంది. రాములవారి విగ్రహం నాలుగు చేతులతో వుండగా లక్ష్మణ స్వామి ఎడమవైపున వున్నట్లు కనపడుతుంది.
🌿ఆయన నాలుగు చేతులలో కుడివైపున వున్న రెండు చేతులలో శంఖము, బాణము వుండగా, వున్న రెండు చేతులలో విల్లు, చక్రము కనిపిస్తుంది...జై శ్రీరామ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment