Adsense

Tuesday, March 28, 2023

వేయి స్తంభాల గుడి, హనుమకొండ Thousand Pillars temple, Hanumakonda



💠 కళలకు కాణాచి ఓరుగల్లు (వరంగల్) నగరంలోని కాకతీయుల కాలం నాటి శ్రీ వేయి స్తంభాల (రుద్రేశ్వరస్వామి) దేవాలయం ఒక వైపు పుణ్యక్షేత్రంగా, మరో వైపు పర్యాటక ప్రదేశంగా విలసిల్లుతోంది. కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీక అయిన నగరం ఇది.

💠 ప్రకృతి రమణీయ దృశ్యాలు, సుందరమైన పర్యాటక స్థలాలు, పుణ్య క్షేత్రాలు, అద్భుతమైన శిల్ప కళా ఖండాలు, పురావస్తు కట్టడాలు ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
రెండు శతాబ్దాల పాటు మహోజ్వలంగా వెలుగొందిన కాకతీయాంధ్ర సామ్రాజ్య రాజధాని నగరం ఓరుగల్లు.
నేడది వరంగల్ అని పిలువబడుతోంది.
తెలుగు తేజానికి, జాతి చైతన్యానికి సాహిత్య సాంస్కృతిక వికాసానికి ప్రతీకగా విలసిల్లిన వరంగల్ జిల్లా వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకుంది.

💠 రాణి రుద్రమదేవి దౌహీ పుత్రుడు ప్రతాపరుద్రుడు ఓరుగల్లు శిల్పకళ, సాబహిత్య, సాంస్కృతిక రంగాలలో పరిపుష్టం చేశారు. కాకతీయుల కాలం ఒక స్వర్ణయుగం.
ఆనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన స్థితిగతులు వారి ప్రాచీన కట్టడాలు శిల్ప కళాఖండాలలో ఈనాటికి స్పష్టంగా గోచరమవుతాయి.

💠 కాకతీయుల ప్రాభవానికి మణికిరీటం సహస్రస్తంభ దేవాలయం. హన్మకొండ పట్టణ నడిబోడ్డున ఉన్న చారిత్రక సుప్రసిద్ధ శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయం. ఇది దేశ విదేశీ పర్యాటకులకు ఆకర్షణ బిందువు.

💠 ఈ దేవాలయాన్ని క్రీ.శ. 1138-1144 మధ్య కాలంలో రుద్రదేవుడు నిర్మించాడు. చుట్టూ లెక్కకు మించి చెక్కిన శిల్పాన్ని తిలకించేందుకు వరసగా సుమారు పది అడుగుల ప్రదక్షణ పథం, తొమ్మిది అడుగుల ఎత్తయిన ద్వారం ఉంది. దీనికి ఎదురుగా సూర్యాలయం, దక్షిణాభిముఖంగా వాసుదేవాలయం ఉండటం వల్ల త్రికూటాలయంగా ప్రసిద్ధి చెందింది.

💠 ఆలయ ప్రాంగణంలో నల్లరాతితో చెక్కిన నంది విగ్రహం నిజమైన వృషభరాజంలా జీవనక ఉట్టిపడుతుంది.

💠 హన్మకొండలోని  శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయం, వేయిస్తంభాల దేవాలయం కాకతీయుల కళా వైభవానికి దర్పణం పడుతుంది.
నిత్యం వందలాలి మంది భక్తులకు, సందర్శకులకు ఒక ప్రత్యేక సందర్శనా ప్రదేశంగా ఫరిడవిల్లుతోంది.

💠 రుద్రేశ్వరాలయ ముఖ ద్వారంపై మనోహరమైన తోరణ శిల్పం ఉంది. దీంతో పాటు వర్తించే శిల్పాలు, రంగ మండప స్తంభాలు, లోపలి కప్పు, ఆలయ రాతి గోడలు, అంతరాల ద్వారాలు, అద్భుతమైన శిల్పాలతో ఆకర్షిస్తుంది.

💠 వెయ్యి స్తంభాల గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే మహా ఉద్వేగానికి లోనవుతాం.
మెట్లు దగ్గరి నుండి గోడల వరకూ దేన్ని చూసినా ప్రాణం లేచివస్తుంది. కుడ్యాలమీద తీర్చిదిద్దిన శిల్పాలు దివ్యలోకంలో అడుగుపెట్టిన భావన కలిగిస్తాయి.

💠 పేరులోనే స్పష్టమౌతున్నట్లు ఇది వేయి స్తంభాలతో నిర్మితమైన దేవాలయం.
అయితే, వేయి స్తంభాలను గణించడం కష్టమైన పనే. కొన్ని విడిగా, ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి. ఆలయ వేదిక వద్ద కొన్ని సుస్పష్టంగా కనిపిస్తాయి.

💠 ఈ గుడి వేయి స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు.. ఇక్కడ మరో విశిష్టత ఉంది.
ఈ స్థంబాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్తస్వరాలు, లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది.

💠 వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు.
ఎత్తయిన వేదికమీద మధ్యలో నృత్య గాన మందిరం ఉంది. పూర్వం ఈ నృత్య మందిరం గాయనీగాయకుల పాటలతో, నర్తకీమణుల నృత్యాలతో అలరారేదని చెప్పే ఆధారాలు ఉన్నాయి.

💠 వేయి స్తంభాల గుడి, ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికీ చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది.
ఈ త్రికూటాత్మక ఆలయంలో దురదృష్ట వశాత్తూ సూర్యభగవానుడి విగ్రహం ప్రస్తుతం లేదు. ఇలాంటి ప్రాచీన దేవాలయాలను, అపురూపమైన శిల్ప సంపదను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంమీద, మనమీద కూడా ఉంది.

💠 ఈ ఆలయంలోకి ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు.

💠 ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి.

💠 మాఘ, శ్రావణ మరియు కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వెస్తే రాలనంతగా భక్త జన సందోహం 

No comments: