Adsense

Thursday, March 30, 2023

సీతా స్వయంవరం సభ.!!

 


🌿రాజసభ, రఘు రామసభ
సీతా కాంత కల్యాణ సభ ।
అరిషడ్వర్గములరయు సభ
పరమపదంబును ఒసగు సభ

🌸వేదాంతులకే జ్ఞాన సభ
విప్రవరులకే దాన సభ ।
దుర్జనులకు విరోధి సభ
సజ్జనులకు సంతోష సభ ॥

🌿సురలు, అసురులు కొలచు సభ
అమరులు, రుద్రులు పొగడు సభ ।
వెరువక హరివిల్లు విరచు సభ
జనకుని మది మెప్పించు సభ

🌸భక్తి జ్ఞానములొసగు సభ
సృష్టి రహితులై నిలచు సభ ।
ఉత్తమ పురుషుల ముక్తి సభ
చిత్త విశ్రాంతినొసగు సభ ॥

🌿గం-ధర్వులు గానము చేయు సభ
రం-భాదులు నాట్యములాడు సభ ।
పుష్ప వర్షములు కురియు సభ
పూజ్యులైన మునులుండు సభ .

No comments: