సీతమ్మ మాయమ్మ అనే వాగ్గేయకారుల పదప్రయోగం చాలా లోతైన విశ్లేషణ తో కూడుకున్నది ఆమె ఎవరయ్యా అంటే.....!!
🌿జనకుడి కుమార్తె, దశరథుడి పెద్దకోడలు, శ్రీరామచంద్రుడి భార్య, మహాసాధ్వీమణి సీతమ్మ తల్లి ఇంతమాత్రమే మనకు తెలుసు.
🌸కాదు సీతమ్మతల్లి సాక్షాత్ మహా శక్తి స్వరూపిణి
జనకుడికి నాగేటిచాలులో దొరక్కముందు, రామయ్యకు పట్టపురాణి కాక ముందు కూడా ఆమె శక్తి స్వరూపిణియే!!
🌸ఐదు వేలమంది బలిష్టులైన సైనికుల చేత తీసుకరాబడిన శివధనుస్సును సీతమ్మ ఎడమ చేతితో పక్కకు జరిపి బంతిని తీసుకుని ఆటలాడుకున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. మహామాయా స్వరూపిణి మహాశక్తి స్వరూపిణి సీతమ్మ!!
🌿అంతే కాదు ఆమె పేరుతో ఒక ఉపనిషత్తే ఉంది!
అందులో ఆమె అసలు సిసలైన స్వరూప స్వభావాలు మనకు గోచరిస్తాయి!!
🌸సీతోపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది! బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు సీతమ్మ మహాత్యాన్ని గురించి వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారింది!!
🌿" మూల ప్రకృతి రూపత్వాత్
సా సీతా ప్రకృతి స్మృతా " !
" ప్రణవ ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతి ఉచ్యతే " !
" సీతా" ఇతి త్రివర్ణాత్మా సాక్షాత్ "మహామాయా" భవేత్" !
🌸సీతాదేవి అయోనిజ, అసామాన్యురాలు, మూలప్రకృతి స్వరూపిణి ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ ప్రకృతి స్వరూప!!
లక్ష్మీ అష్టోత్తర శత నామాలలో మొట్టమొదటి నామం ఓంప్రకృత్యైనమః!
🌿సీతమ్మతల్లి మహాలక్ష్మీస్వరూపం!!
రామయ్య పురుషస్వరూపం!!
సీతమ్మ ప్రకృతిస్వరూపం!!
🌸ప్రకృతిపురుషులకు ప్రతిరూపాలు సీతారామచంద్రులు
అంతే కాదు ప్రణవనాదమైన ఓంకారంలో ఉంది కూడా ఆ తల్లే!!
🌿సీత సత్వ రజ తమో గుణాత్మకమైంది! ఆమె మహామాయా స్వరూపిణి! సకార, ఇకార, తకారాల సంగమం!
🌸సకారం ఆత్మ తత్త్వానికి సంకేతం! ఇకారం ఇచ్ఛా శక్తికి సంకేతం! తకారం తారా శక్తి! తరింప జేసేది! అంటే ఆత్మదర్శనం కలిగించి పరమాత్మతో అనుసంధానం చేసి జీవుడిని తరింప జేసేది ఆ మహాశక్తి అని బ్రహ్మగారు వివరించారు!! ఆ కీట బ్రహ్మ పర్యంతం సమస్త సృష్ఠికీ, సమస్త జగత్తుకూ తల్లి సీతమ్మతల్లి!!
🌿సీతమ్మ తల్లి మొదటి రూపం మహామాయ! దీనినే శబ్దబ్రహ్మమయి రూపం అని కూడా అంటారు! అమ్మ జ్ఞాన స్వరూపిణిగా వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంలో ఉండి అత్యున్నతమైన అలౌకికమైన భావాలను కలుగజేస్తుంది!!
🌸రెండోరూపం జనకుడు భూమిని దున్ను తున్నప్పుడు బయటపడిన రూపం! జనకుని కోట్లజన్మల పుణ్యవశంచేత తనకుతానుగా బిడ్డగా లభించిన క్రియాశక్తి రూపం సీతమ్మ!!
🌿మూడోరూపం అవ్యక్త ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా జీవులందరిలో ఉంటుంది!జగత్తంతటిలో నిండి ఉండే జగదానంద కారిణిగా లక్ష్మీ స్వరూపంగా విరాజిల్లే తల్లి!!
🌸ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు శక్తుల
రూపంగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా
సాధకులు, ఉపాసకులు దర్శించవచ్చని బ్రహ్మదేవుడు దేవతలకు బోధించాడు!!
🌿రామభక్తులను హనుమభక్తులను అమ్మ కంటికి రెప్పలాగా కాపాడుతుంది!!
అదే విధంగా అమ్మఉపాసకులకు రామకృప,
హనుమకృప శీఘ్రంగా లభిస్తాయి!!
🌸 భక్తరామదాసస్వామి భక్తితో పాడారు నను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి!!
నను బ్రోవుమని చెప్పవే! నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి! జనకుని కూతుర జననీ
జానకమ్మా! నను బ్రోవుమని చెప్పవే!!
🌿మనందరిపై సీతారామచంద్రస్వామి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ....స్వస్తి..
No comments:
Post a Comment