Adsense

Tuesday, March 28, 2023

ఆదిశేషావతారము-రామానుజుడు



శ్రీ రామానుజులు విశిష్టాద్వైతమతమును కుంభకోణము, కేరళ దేశము, ద్వారక, మధుర, సాలగ్రామము, సాకేతనగరము, బదరీనారాయణ క్షేత్రము, నైమిశారణ్యము, కాశ్మీరము, కాశీ, శ్రీకూర్మము, సింహాచలమును చూచుచు, బోధించుచూ విశిష్టాద్వైతమత సిద్ధాంతములను ఇతర మతస్థులకును బోధించుచు వారిని కూడ వైష్ణవులనుగా మార్చెను, మఠములను, దేవాలయములను నిర్మింపజేసెను.

ఆకాశరాజు కుమారునితో తొండమానుడు యుద్ధమూ చేయుటకు శ్రీ వేంకటేశ్వరుడు తన శంఖ చక్రములను తొండమాను చక్రవర్తికి ఇచ్చెను గాన శ్రీ వేంకటేశ్వర స్వామిని కొందరు దేవి యనియును, కొందరు కుమార స్వామి యనియును,కొందరు శివుడనియును భావించుచున్నారు. శైవులే పూజారులుగా నుండి అభిషేకాదులు చేయుచుండిరి.

అప్పుడు వైష్ణవులు శ్రీ రామానుజాచార్యులను రప్పించి దేవుడు విష్ణువేగాని శివాది అన్య దేవతారూపుడు గాదని ప్రమాణములతో శైవాది మతస్థులతో వాదింప జేయించిరి. చక్రములను ధరింప జేయించిరి. అప్పటినుండి తిరుపతి దేవుడు విష్ణావ తారమేయని ప్రజలు నిశ్చయించుకొని శ్రీ రామానుజాచార్యులు నిర్ణయించిన పూజాది ఉత్సవములను జరుపుకొనుచున్నారు. శైవులలో ననేకులు వైష్ణవులైరి. శ్రీ రామానుజులు ఆది శేషావతారమని వైష్ణవులు చెప్పుచుందురు.

No comments: