Adsense

Tuesday, March 28, 2023

టమోటా దోశ తయారీ Tamato Dosa Recipe

టమోటా దోశ
కావాల్సిన పదార్థాలు
3-4 టొమాటోలు
1 కప్పు బియ్యం పిండి
1 కప్పు రవ్వ
1/4 కప్పు గోధుమ పిండి
1/2 టీస్పూన్ వంట సోడా
1/2 అల్లం పేస్ట్
3-4 ఎండు మిర్చి
1/4 టీస్పూన్ జీలకర్ర
తాజాకొత్తిమీర 2-3 టీస్పూన్లు
ఉప్పు రుచికి తగినట్లుగా
దోశలు వేయించటానికి నెయ్యి లేదా నూనె
నీరు
తయారీ విధానం
ముందుగా ఒక బ్లెండర్లో పెద్దగా కోసిన టొమాటో ముక్కలు, ఎండు మిర్చి, అల్లంపేస్ట్ వేసి కొన్ని నీళ్లుపోసుకొని ప్యూరీలాగా మారేవరకు గ్రైండ్ చేసుకొండి.
ఇప్పుడు ఈ టోమాటో ప్యూరీని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఇందులో బియ్యం పిండి, రవ్వ, గోధుమ పిండి, జీలకర్ర, వంట సోడా, కొత్తిమీరా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం పలుచగా ఉండాలి కాబట్టి కావాల్సినన్నీ సుమారు 2-3 కప్పులు నీరు పోసుకోండి.
అన్నీ వేశాక 10 నిముషాలు అలాగే ఉండనివ్వండి. దాదాపు పది నిమిషాల తర్వాత మీ ఇన్‌స్టంట్ టొమాటో దోశ పిండి ఇప్పుడు సిద్ధంగా ఉంది.
ఇప్పుడు స్టవ్ మీద తవా వేడి చేసుకోండి. దోశ పాన్‌పై కొంచెం నీరు చిలకరించాలి. అది సిజ్లింగ్ అయితే, దోశ చేయడానికి మీకు సరైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఇపుడు ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యిని తవాపై పరిచి ఒక చిన్న గిన్నె ద్వారా పలుచటి దోశపిండిని తీసుకొని తవా మీద దోశలాగా విస్తరించండి.
అన్ని వైపులా కొన్ని చుక్కల నూనె లేదా నెయ్యి వేసి దోశ క్రిస్పీగా, గోధుమ రంగులోకి మారేంత వరకు కాల్చండి.
ఇప్పుడు దోశను జాగ్రత్త తవా మీద నుంచి తీసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, వేడివేడి టొమాటో దోశ రెడీ. కొబ్బరి చట్నీ, సాంబారుతో కలిపి తీసుకోవాలి.

No comments: