THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Thursday, March 30, 2023
శఠగోపం మహిమ
🌾శ్రీవైష్ణవాలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు అర్చకస్వాములు తీర్ధం, తులసీ ప్రసాదంగా యిచ్చి అందరి శిరస్సులపై మహావిష్ణువు పాదుక ముద్రలుండే శఠగోపాన్ని పెట్టి ఆశీర్వదిస్తారు.
🌾ముకుళిత సస్తాలతో , శిరస్సు వంచి ఆ శఠగోపాన్ని భక్తితో
శిరస్సు పై పెట్టించుకోవాలి,
మన తలవ్రాతలని మార్చే శక్తి శఠగోపానికి వున్నది.
🌾మహావిష్ణువు చరణాలను ఆశ్రయించి శరణు వేడుకుంటున్నాము అంటే మన శిరస్సును
ఆయన పాదలపై పెడుతున్నాము అని అర్ధం...
🌾ప్రత్యక్షంగా శ్రీ మహావిష్ణువు పాదాలపై తలపెట్టే మహాద్భాగ్యం ఏ పుణ్యపురుషులకో తప్ప అందరికీ లభించదు.
🌾కాని భగవంతుని పాదుకల ముద్రలను శఠగోప రూపంలో పెట్టించుకొని నందువలన మహావిష్ణువు పాదాలే మన శిరస్సుకి తగిలి
పాప విముక్తు లవుతున్నామనే పవిత్ర భావన, తృప్తి కలుగుతుంది.
🌾స్వామి వేదాంత దేశికర్ " పాదుకా సహస్రం"
అనే అద్భుతమైన గ్రంధం రచించారు.
శ్రీ రంగనాధుని పవిత్ర చరణాల మహిమలను తెలిపే గ్రంథం యిది.
🌾వేదాంతదేశికర్ కి
" కవి తార్కిక కేసరి"
అనే బిరుదును లభింప చేసినది యీ గ్రంధం.
🌾ఒకే రాత్రిలో వ్రాసిన యీ అద్భుత గ్రంధంలో శ్రీ పాదుకల మహిమలే కాకుండా శ్రీవైష్ణవమత ఔన్నత్యం కూడా వివరంగా వర్ణించబడింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment