Adsense

Wednesday, March 29, 2023

రేపు అశోకాష్టమి చైత్ర శుద్ధ అష్టమి - అశోకాష్టమి సంతానప్రాప్తి కోసం..



*అశోకాష్టమి రోజు ఏమి చేయాలి ?*

అశో + కాష్టమి - శోకం పోవటం కోసం , శోకం కలుగకుండా ఉండడం కోసం  *అశోక పుష్పాలతో* శివుడికి పూజ చేయటం వలన సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు. ఎవరయినా సరే   ఎలాంటి దుఃఖం పోవటం కోసం అయిన సరే అష్టమి రోజు ఈశ్వరుడికి అశోక పుష్పాలతో పూజ చేయాలి.

*కథ*

పూర్వం ఒక మునికి ఒక కూతురు ఉండేది. తనకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు. తన దివ్య ద్రుష్టి తో చూసి రధం లో వెళ్ళేటప్పుడు అశోక వృక్ష విత్తనాలు ఇచ్చి దారిలో రెండు ప్రక్కల జల్లుతూ వెళ్ళమని చెపాడు. తనుకూడా అలాగే చేసింది. తను గర్బవతి అయింది కానీ గర్బ స్రవం జరుగుతూ ఉంది. అల 5 సార్లు జరిగింది దాని వలన వేదన కలుగుతుంది. నా కష్టం ఎవరితో చెప్పుకోవాలి అని అలోచించి తన తండ్రి తో చెప్పుకోవాలి అని అలోచించి ఇంటికి తిరిగి వస్తుండగా తను జల్లిన అశోక విత్తనాలు పెద్ద వృక్షాలు గా తయారు అయ్యాయి. చాల సంతోసించింది , తండ్రి దగరకి వచ్చి తన కష్టం చెప్పుకుంది. తండ్రి చైత్ర శుద్ధ అష్టమి నాడు అశోక పువ్వులతో చిగురులతో పరమేశ్వరుడికి పూజ చేయించాడు.  బుదవారం రోజున పునర్వసు నక్షత్రం వచ్చిన రోజు మధ్యాహనం ఈశ్వరుడికి పూజ చేసి తరువాత అ ప్రసాదం గా పిల్లలు లేని ఆడవాళ్లు  8 ఈ అశోక పువ్వులను నీళ్లలో కలిపి లేదా మాములుగానే గానే  తినాలి. ఇలా చేయటం వలన సంతానం కలుగుతుంది అని తెలుస్తుంది. అశోక పువ్వుల వలన అండ వృద్ధి బాగా జరుగుతుంది , పటిష్టం చేస్తుంది.

No comments: