Adsense

Thursday, March 30, 2023

అయోధ్యా రాముడు...!!


     


🌿ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యానగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న సరయూ నది
దక్షిణ తీరాన రాముడు
అవతరించిన  పుణ్య స్ధలంవున్నది.

🌸ఇక్కడ శ్రీరామునికి
పెద్ద ఆలయం నిర్మించారు.
ఈ అయోధ్యానగర ప్రాంతాలలో రామాయణకాలంనాటి
చిహ్నాలు ఎన్నో గత చరిత్రకు
నిదర్శనం గా ఆలయాలుగా, పవిత్ర తీర్ధాలుగా దర్శనమిస్తాయి.

🌿శ్రీరామచంద్రునిగా అవతరించిన మహావిష్ణువు రామజన్మ భూమిలోని  ఒక పెద్ద ఆలయంలో
పట్టాభిరామునిగా దర్శనమిస్తున్నాడు.

🌸హనుమాన్ గర్హీ అనే ఒక చిన్న ఆలయంలో హనుమంతుడు కుడిచేతిలో గద,  ఎడమ చేతిలో సంజీవ పర్వతాన్ని ధరించి, కాళ్లు
వెడల్పుగా జాపి , ఎగరడానికి సిధ్ధంగా వున్న భంగిమలో కనిపిస్తాడు.

🌿ఈ ఆలయాన్ని రాజా విక్రమాదిత్యుడు
నిర్మించాడు. సీతా రసోయి అనేచోట సీతాదేవి వంటచేసిన ఆ కాలపు పొయ్యిలు వరుసగా వున్నవి.

🌸బంగారు భవనమైన కనకభవనంలో
శ్రీ రాముడు ,సీతాదేవి  స్వర్ణ సింహాసనం మీద ఆశీనులై  దర్శనమిస్తారు.

🌿వీరి శిరోజాలు మేలిమి బంగారంతో తయారు చేసినవిగా చెపుతారు. ఈ స్వర్ణ భవనం
సీతారాముల శయనమందిరంగా
భావించబడుతున్నది.

🌸లక్ష్మణుని భవనంలో  లక్ష్మణుడు ఒంటరిగా ముకుళిత హస్తాలతో దర్శనమిస్తున్నాడు.

🌿ఈ భంగిమ లక్ష్మణుడు
ఎవరినో ఆహ్వానిస్తున్నట్టే
వుంటుంది. లక్ష్మణ్ ఖిలా అనే భవనం లక్ష్మణుని కోటగా పిలవబడినా
అలాగ కనిపించదు.

🌸చిన్న గుహలా ఈ ప్రదేశంలో
లక్ష్మణుడు కనిపించడు.
కాని ఆక్కడ దైవీకమైన ప్రశాంతత కనిపిస్తుంది.

🌿సరయూ స్నాన ఘట్టం:
ఈ స్నాన ఘట్టంలో
రాముడు అతని సోదరులు
బాల్యంలో  నిత్యమూ నిత్యానుష్టాలనాచరించి
ధ్యానంచేసుకునేవారట.

🌸స్వర్గతారా  అనేది సరయూనదికి  మరో
స్నాన ఘట్టం. ఇక్కడే
శీరాముడు తన అవతారసమాప్తి కావించిన తీర్థస్థలంగా భావిస్తారు.

🌿అయోధ్యలోని
రాముని ఆలయంలో
ఆయన పుట్టినరోజు రావడానికి 15 రోజుల ముందునుండే  ఉత్సవాలు
ఆరంభమౌతాయి.

🌸భక్తులు నిత్యం
రామ భజనలతో రాముని స్తుతిస్తారు.  తులసీదాసు
యొక్క రామచరిత మానస్
ప్రవచనాలుగా చెప్పబడతాయి.

🌿వేద మంత్రాలతో యాగాలు జరుపుతారు. స్త్రీలు రాముని
బాలరామునిగా అలంకరించి
ఉయ్యాలలో పరుండబెట్టి
జోలపాటలు పాడుతారు.

🌸నిత్యం రాముని  సన్నిధిలో
హరతి కార్యక్రమం జ‌రుగుతుంది. రాత్రి
అయోధ్యానగరమంతా
టపాకాయల వెలుగులతో
వెలిగి పోతుంది.

🌿శ్రీ రామ నవమి  రోజున
రాముని పాద ముద్రలు పడిన అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకోవడం  వలన జీవితంలో ప్రశాంతత  సర్వ
శుభాలు లభిస్తాయని
భక్తులు ధృఢంగా నమ్ముతారు....స్వస్తి

No comments: