Adsense

Thursday, March 30, 2023

వసంత కాలం



చైత్రమాసం పాడ్యమి మొదలు నవమి వరకు గల 9 రోజుల వసంత నవరాత్రులు.

చైత్రమాసం చెట్లు అన్నీ చిగురించి పుష్ప పత్ర ఫలాదులు అందించడం ప్రారంభం.

లేత చివుళ్ళ ను తిని కోయిల ల కుహు కుహు రాగాలు  ఆప్పుడే ఆకులు చివుళ్లు పూలు పిందెలు కాయలు కంటికి ఇంపుగా ప్రకృతి కనిపించే  కాలం ఈ వసంత కాలమే

శ్రీమన్నారాయణుడు దుష్టసంహారం నిమిత్తం రామచంద్రుడు గా అవతరణ చేసిన   తరుణం ఈ చైత్ర మాసమే

అది కవి వాల్మీకి అనుగ్రహించిన రాముని చరిత ను పారాయణ అధ్యయనం అనాదిగా ఆచరించే కాలం.

అయోధ్య మొదలు భద్రాచలం వరకు ఇల్లు మొదలు రామాయలయం వరకు వాడ వాడ ల మా రాముడు మా సీత అని వకాల్తా పుచ్చుకొని సీతారాముల కల్యాణం నిర్వహించుకునే సమయం ఈ చైత్రమాసమే..   .

ప్రకృతి తో మమేకమైన శ్రీరామానుభవ కాలం అందరూ సద్వినియోగం చేసుకోవాలని రామచంద్రుణ్ణి ప్రార్థన చేస్తున్నాను.

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

No comments: