Adsense

Monday, April 3, 2023

చెన్నకేశవస్వామి దేవాలయం,బేలూర్, కర్ణాటక ...!!




🌿దేశంలో దేవుళ్లు స్వయంభువుగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతోపాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి వున్నాయి.

🌸 అయితే.. మరికొందరు రాజులు మాత్రం చరిత్రలో తమ పేరుప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా కొన్ని ఆలయాలను గుర్తుగా నిర్మించుకున్నవారున్నారు.

🌿అటువంటి ఆలయాల్లో 'చెన్నకేశవ ఆలయం'ను ఒకటిగా చెప్పుకోవచ్చు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసలుల రాజవంశస్థులు నిర్మించినట్లు చారిత్రక నిపుణులు పేర్కొంటున్నారు.

🌸ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో వుంది.
బేలూర్ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశము .

🌿అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్ జిల్లా లో బెంగుళూర్ నుండి కేవలం 220 కి. మీ. ల దూరంలో ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు , దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయల వలన దీనిని అందరు దక్షిణ కాశి అంటారు.

🌸చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది
బేలూర్ హొయసల సామ్రాజ్య రాజధానిగా ఉంది కనుక చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది. ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబిడ్ కూడా హొయసల రాజధానిగా ఉంది ఇది పురాతన నగరం.

🌿ఈ రెండు నగరాలు
ఈ రెండు నగరాలు హొయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణలు - తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు.

🌸విజయనగర రాజుల కాలం 1117 సంవత్సరంలో  (12వ శతాబ్దం) హస్సన్ జిల్లాలో  నిర్మించిన బేలూర్ చెన్నకేశవాలయం అంతా పూర్తి కావడానికి 103 సంవత్సరాలు పట్టిందట.

🌿దాదాపు 1000 మంది ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. దేవాలయ ముఖ ద్వారంలో మకర తోరణం,  దశావతారాలు కనిపిస్తాయి.
నవరంగ మండపం ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణ. 

🌸ఈ మండపం అంతా 48 స్తంభాలతో ప్రతి స్థంభం మీద ఒక్కో ప్రత్యేకమైన శిల్పం చెక్కబడి ఉంటాయి.  ముఖ్యంగా విష్ణు మూర్తి మోహిని రూపంలో ఉన్న మోహిని శిల్పం, నరసింహ శిల్పం, శాంతలాదేవి శిల్పం, శుకభాషిణి (lady with a parrot),  గంధర్వ నాట్య భంగిమలు ఇలా 48 శిల్పాలు హొయసల రాజ్య శిల్పుల ప్రతిభకి అద్దం పడతాయి.

🌿కొన్ని శిల్పాలకు చేతికి ఉన్న ఉంగరం, గాజులు సులువుగా తిప్పుకోవచ్చు అట. దేవాలయ బయట గోడ మీద ఖాళీ అనేదే లేకుండా చెక్కిన చిన్న చిన్న కళాకృతులు..

🌸మొదటి వరసలో 650 చిన్న ఏనుగులు వేరు వేరు భంగిమలలో,  రెండో వరసలో సింహాలు, మూడో వరసలో నాట్య భంగిమలు ఇలా గోడలు అంతా రకరకాల బొమ్మలతో ఏకశిల మీద చెక్కడం విశేషం.

🌿ఎన్నోసార్లు మొహమ్మదీయుల దండయాత్రలో ధ్వంసం అయినా విజయనగర రాజులు మళ్ళీ పునరుద్దించుకుంటూ ఉండబట్టి దాదాపు 1000 సంవత్సరాలు అయినా మనం ఇప్పటికి ఈ అద్భుతమైన దేవాలయం చూడగలుగుతున్నాం.

🌸 ఆలయం యొక్క ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరణిని (మెట్లబావి) కూడా చూడవచ్చు. ఆలయం యొక్క అంతర్భాగంలో
విజయనగర సామ్రాజ్యం రోజులలో ఈ ఆలయం యొక్క రాజగోపురాలు నిర్మించబడ్డాయి.

🌿ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడము కూడా ఉన్నాయి.

🌸బేలూర్ - గ్రావిటీ పిల్లర్
ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే ఈ 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి.

🌿 విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది. హొయసల శైలి శిల్పకళకు నిలువుటద్దంగా ఈ దేవాలయం వుంటుది

🌸బేలూర్ చేరుకోవడం ఎలా?
రోడ్డు మార్గం
బేలూర్ హళేబీడు లకు మీరు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

🌿హస్సన్ నుండి బస్సు ద్వారా గాని లేకుంటే మీకు సొంత వాహనం ఉంటే మీరే సొంతంగా డ్రైవ్ చేసుకొని రావచ్చు. హస్సన్ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుంచి,

🌸వివిధ నగరాలనుంచి బెంగళూరు, మైసూరు నుంచి కూడా బస్సులు వస్తుంటాయి.

🌿రైలు మార్గం
హస్సన్ రైల్వే స్టేషన్ కు బెంగళూరు, మైసూరు, మంగళూరు ప్రాంతాలనుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి...స్వస్తి..

No comments: