THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Monday, April 3, 2023
తిరుమల వరాహస్వామి ...!!
🌿శ్రీమహావిష్ణువు మూడవ అవతారమైన వరాహస్వామి ఆలయాలు మనదేశంలో పలుచోట్ల వున్నాయి.
🌸వాటిలో ప్రముఖమైన దివ్యదేశముతిరుమల పుణ్యక్షేత్రము.
ల్ల్ల్ఆదిన తిరుమల వరాహస్వామి ఆలయంగానే వుండేది. అక్కడవున్న
పుష్కరిణికి స్వామి పుష్కరిణి అని పేరు. పుష్కరిణి ఒడ్డున
వరాహస్వామి వారి ఆలయం.
🌿 ఈనాటికి ప్రధమ పూజలు సమర్పించేది వరాహస్వామివారికే.
పద్మపురాణంలో ఈ ఆలయం తిరుమల వరాహస్వామి ఆలయంగానే
వివరించబడినది.
🌸ఏడుకొండలపై స్వామి
పుష్కరిణిలో ఆశ్వీయుజ
మాసంలో శ్రవణా నక్షత్రం రోజున వరాహస్వామి వెలసి
తిరుమల వరాహ స్ధలమైనట్లు పద్మపురాణం వివరించింది.
🌿ఇక్కడ శ్రీనివాసునికి
ప్రత్యేక పూజలు జరుగుతాయి.
కారణం, ఒకే పుణ్యక్షేత్రంలో
రెండు మహావిష్ణువు అంశలకు ముఖ్య పూజలు జరపడం ఉచితం కాదని ,,
🌸 (వరాహస్వామి ప్రధమంగా
ఇక్కడ వెలసినప్పటికి) శ్రీనివాసునికే బలిపీఠ పూజ, హోమం, బ్రహ్మోత్సవాలు మొదలైనవి జరపాలని
రామానుజాచార్యుల
వారు మంగళాశాసనం చేశారు.
🌿అయినా శ్రీ నివాసునికి
పూజలు జరపడానికి ముందే
వరాహస్వామికి పూజలు
జరుగుతాయి. తీర్థయాత్రలకి వచ్చిన వారు ప్రధమంగా వరాహ తీర్ధం లో స్నానం చేసి వరాహస్వామిని దర్శించిన పిమ్మటే వెంకటేశ్వరస్వామి ని దర్శించాలని మంగళా శాసనం చేశారు.
🌸భవిష్యోత్తర పురాణంలో
శ్రీనివాసుడు తనకు నివసించడానికి చోటు యిమ్మని వరాహస్వామిని
వేడుకోగా శ్రీ నివాసునికి
వరాహస్వామి ఆయనకు ఇప్పుడున్న స్ధలం యిచ్చినట్లు వర్ణించబడింది.
🌿 8ఫిరాల్శ్రీనివాసుడు వరాహస్వామిని యిలా అడిగాడు. " స్వామీ ..యీకొండ మీద మిమ్మల్ని చూసే భాగ్యం కలిగినది. నాకు ఇక్కడ నివసించాలనే కోరిక కలిగినది.
🌸కలియుగం ముగిసేదాకా నాకు నివసించడానికి చోటు యివ్వండి." అని విన్నవించుకున్నాడు.
దానికి వరాహస్వామి " నేను ల్
🌿స్ధలానికి తగిన వెలను యిచ్చి
నివసించవచ్చును." అని అనగా, అది విని శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చే భక్తులందరూ నన్ను
చూడడానికి ముందే తమరిని దర్శిస్తారు.
🌸పాల తిరుమంజనం, నైవేద్యం మొ.
మీకే జరుగుతాయి. ఈ విధంగా మీకు ప్రాముఖ్యత యివ్వడమే సరసమైన ధరగా భావిస్తున్నాను"
అని చెప్పగా వరాహస్వామి
శ్రీ నివాసునికి వంద అడుగుల స్ధలాన్ని యిచ్చినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.
🌿శ్రీమద్రామానుజా చార్యులవారు
వరాహస్వామికి ఒక ఉత్సవమూర్తిని తయారు చేయించి ప్రతిష్టించారు.
ఆ మూర్తికే అధ్యయన ఉత్సవం, వరాహ జయంతి ఉత్సవాలు జరిపారు.
🌸తిరుమలలో వరాహస్వామి వెలసిన ఆశ్వీయుజ శ్రవణా
నక్షత్రం రోజున ఘనవైభవంగా
ఉత్సవం జరిపారు.
ఈనాటికి ఆ ఉత్సవాలు తిరుమలలో ఘన వైభవంగా జరుగుతున్నాయి.
🌿యాత్రీకులంతా ముందుగా వరాహస్వామిని దర్శించిన
పిదప ఏడుకొండలవాడిని
దర్శించాలి. అప్పుడే వారి పూజలు
ప్రార్ధనలు,యాత్ర సంపూర్ణమౌతాయి...స్వస్తీ...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment