బియ్యం దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలివే...!!
🌿గత జన్మలో కర్మల ఫలితం ఈ జన్మలో ఉంటుందని అంటారు. ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుందనేది పండితుల వ్యాఖ్య.
🌸బియ్యం దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెబుతున్నాయి. అయితే, నవగ్రహ దోష నివారణకు దానాలు చేయడం వల్ల సకల శుభాలు చేకూరి కోరిన కోర్కెలు తీరుతాయి.
🌿 రవి గ్రహ దోషం ఉంటే గోధుమలను దానం చేసి, కెంపు పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల రోగాలు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది.
🌸గురు గ్రహ శాంతికి శనగలు, చంద్రుడికి బియ్యం, కుజుడికి కందులు, బుధుడిక పెసలు, శుక్రుడికి అలసందలు, రాహువుకి మినుములు, కేతువుకు ఉలవలు, శనికి నువ్వులను దానం చేయాలి.
🌿 మరణ భయంతో భీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడం, వ్యాధులతో నరకయాతన అనుభవించే రోగులకు వైద్యం చేయడం, పేదలకు ఉచితంగా విద్యను అందించడం, ఆకలితో అల్లాడే వారికి అన్నదానం చేయడం ఈ చతుర్విద దానాలు చేసిన వారి పూర్వ జన్మ పాపాలు నశించి, ఈ జన్మలోనే సుఖిస్తారు.
🌸శక్తి కొలది చేసే ధనసాయం కానీ, వస్తు సహాయం కానీ..'ధర్మం' అంటారు. ఇలా 'ధర్మం' చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.
🌿మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునికి చేసిన దానఫలం, పరలోక సుఖాలను అందించడమే కాదు ఉత్తమ జన్మ ప్రాప్తికి ఉపయోగపడుతుంది. 'ధర్మం' చేయడానికి ఎలాంటి పరిధులు లేవు.
🌸తోచింది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, 'దానం' చేయడానికి మాత్రం కొన్ని పరిధులు ఉన్నాయి. శాస్త్ర నియమానుసారం దాన యోగ్యమైన వాటిని మాత్రమే దానంగా ఇవ్వాలి. వీటినే 'దశ దానాలు' అంటారు.
🌹దశ దానాలు- ఫలితాలు🌹
🌿దూడతో ఉన్న ఆవు, భూమి, నువ్వులు, బంగారం, ఆవు నెయ్యి, వస్త్రాలు, ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ దానాలుగా శాస్త్రాల్లో నిర్ణయించింది.
🌸వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఏయే దానం వల్ల ఏయే ఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం.
🌹గోదానం🌹
🌿గోవులో సమస్త లోకాలు ఉంటాయి. పాలిచ్చే ఆవు, దూడతో కలిపి బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురం, రాగి తోక, నూతన వస్త్రాలతో అలంకరించి, పాలు పితికే పాత్రను కలిసి దానం చేస్తే శ్రీమహావిష్ణువు సంతుష్టుడై దాతకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.
🌹భూదానం🌹
🌸కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా భూమి శూన్యంలోకి దొర్లిపోతుంటే శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చి తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు.
🌿 సుక్షేత్రం, సమస్త సస్యసమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది.వీరికి శివలోకప్రాప్తిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు.
🌹తిలదానం🌹
🌸తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి విష్ణులోకం ప్రాప్తిస్తుంది
🌹హిరణ్య (సువర్ణ) దానం🌹
🌿బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై అగ్నిలోక ప్రాప్తిస్తాడు.
🌹నెయ్యి దానం🌹
🌸ఆజ్యం అంటే ఆవు నెయ్యి. ఇది కామధేనువు పాల నుంచి ఉద్భవించింది. దీనిని యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు.
🌿అంతటి పవిత్రమైన ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యఙ్ఞఫలం లభిస్తుంది. ఈ దానంతో ఇంద్రుడు సంప్రీతుడై, దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
🌹వస్త్ర దానం🌹
🌸చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం. కేవలం అలంకారినికే కాకుండా మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వల్ల సర్వ దేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతను దీవిస్తారు.
🌹ధాన్య దానం🌹
🌿జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయడం వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది, ఇహలోకంలో సకలసౌఖ్యాలను అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.
🌹గుడ దానం🌹
🌸రుచులలో మధురమైనది బెల్లం.
ఈ బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది. బెల్లం అంటే వినాయకుడు, శ్రీమహాలక్ష్మీకి మహా ప్రీతి. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంతుష్టులై దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.
🌹రజత దానం🌹
🌸అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివకేశవులు సంతృప్తి చెందుతారు దాతకు సర్వసంపదలు వంశాభివృద్ది అనుగ్రహిస్తారు
🌹లవణ దానం🌹
🌿రుచులలో ఉత్తమమైనది ఉప్పు,
ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తి చెందుతుంది ఆయుష్షు బలం సంతోషాన్ని అనుగ్రహిస్తారు, వీటిని గ్రహణ సమయంలో చేస్తే దీనికి పడింతల ఫలితం ఉంటుంది
🌸అంతేకాదు దానం భక్తి శ్రద్ధలతో చేయాలి గాని, దాన గ్రహీతకు ఎదో ఉపకారం చేస్తున్నామనే భావనతో గాని నలుగురిలో గొప్పగా చెప్పుకునేటందుకు గాని దానం చేయరాదు, ఒకవేళ అలా చేసినప్పుడు ఎలాంటి ఫలితం దక్కదు..స్వస్తి.
No comments:
Post a Comment