Adsense

Saturday, April 22, 2023

గంగా నది పుష్కరాలు..!!

గంగా నది పుష్కరాలు..!!


🌹🙏 తుంగ తరంగే గంగే
జయ తుంగ తరంగే గంగే

దూరీకృత పాప సమూహే
పూరిత కచ్ఛప తుచ్ఛ గ్రాహీ

తుంగ తరీంగే గంగే
పరమహంస గురు భణిత చరిత్రే

బ్రహ్మా విష్ణు శంకర నుతి పాత్రే
తుంగ తరంగే గంగే
సదాశివ బ్రహ్మేంద్రులు...
🙏🌹

🌹🙏గంగా నది 🙏🌹

🌿గంగ పరమ పవిత్రమైన నది. ఆ నదిలో స్నానం చేసినంత మాత్రానే అన్ని పాపాలు తొలగి పోతాయన్నది హిందువుల నమ్మకం.

🌸అసలు గంగ ఎవరు అన్న దానికి సంబంధించి అనేక కథలున్నాయి ఆమె మేనా , హిమవంతుల పెద్ద కుమార్తె అనీ , పార్వతీ దేవికి సోదరి అనీ విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించిందని వేర్వేరు కథలు ఉన్నాయి.

🌿విష్ణు పాదోద్భవి అయిన ఆ గంగను బ్రహ్మ దేవుడు తన కమండలంలోకి తీసుకున్నాడని కథనం.

🌸భగీరథుని వెంట ఆమెను బ్రహ్మ పంపాడనేది ఒక కథ. ఆ సమయంలో ఆమె తాను భూమి మీదకు రాగలనని అయితే తనను ఆపి తట్టుకోగల శక్తి గల వాడు ఉండాలని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి.

🌿 భగీరథుడు అందుకు సమర్థుడు శివుడని ఎంచి ఆయనను ప్రసన్నం చేసుకోగా ఆయన అందుకు సిద్ధపడ్డారు.

🌸అలాగ శివుని జటాజూటంలోనికి గంగ ఉరికి వచ్చింది. శివ స్పర్శతో మరింత పావనమైంది. ఆ గంగలోని ఏడు బిందువులను శివుడు భూమి మీదకు వదిలాడు.

🌿ఆ బిందువులు మొదట పడిన చోటు బిందు సరస్సు. అక్కడి నుంచి గంగా నది ప్రవహిస్తూ దారిలో జహ్నుముని యజ్ఞశాలను ముంచెత్తింది. దానితో ముని కోపించి మొత్తం నదీ ప్రవాహాన్ని తాగి వేశాడు.

🌸అయితే భగీరథుడు ప్రార్థించగా తన చెవి నుంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి తాగి విడిచి పెట్టినది కనుక ఆమెకు జాహ్నవి అనే పేరు వచ్చింది. గంగా నది జహ్నుని చెవి నుంచి బయటకు వచ్చిన రోజు  వైశాఖ శుద్ధ సప్తమి

🌿 అప్పటి నుంచి నిరాటంకంగా ఆమె ప్రవహించింది. కనుక ఆ రోజును ఆమె జయంతిగా జరుపుకొంటుంటారు. ఈ జయంతినే జాహ్నవీ జయంతి , గంగా జయంతి అని కూడా అంటారు.

🌸ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం , పూజనిర్వహించే ఆచారం కూడా ఉన్నాయి.
అలాగే శర్కర సప్తమి , నింబ సప్తమి , అనోదన సప్తమి , ద్వాదశ సప్తమి వ్రతాలు , పర్జన్య పూజ వంటివి చేసే ఆచారం ఉంది.

🌿గంగాదేవి మనుష్య రూపంలో భూమి మీద సంచరిండం వంటి కథలూ ఉన్నాయి. ఒక సారి ఆమె భూమి మీద మనుష్య రూపంలో సంచరిస్తుండగా శంతన మహారాజు చూసి మోహించి వివాహం చేసుకోవడం కూడా జరిగింది.

🌸 వారికి పుట్టిన పిల్లల్లో ఒకరే మహా భారతంలో ప్రముఖ పాత్ర వహించిన కురు పితామహుడు భీష్ముడు. ఒక గంగా దేవి శివుని భార్య అన్న అపప్రధ కొందరిలో ఉంది.

🌿గంగను శివుడు ధరించాడు కాని ఆమెను వివాహం చేసుకోలేదు. ఆమె ఆయనకు భార్య కాదు.
మన దేశంలో గంగా నది చాలా దూరం ప్రవహించింది.

🌸ఆ నదీ తీరాన ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో కాశీ ప్రముఖమైనదని వేరే చెప్పనక్కర్లేదు. ఇక గంగా , యమునా , అంతర్వాహిని అయిన సరస్వతితో కలిసే సంగమం త్రివేణీ సంగమంగా ప్రసిద్ధం.

🌿అది మరో అతి పవిత్రమైన తీర్థ క్షేత్రం. గంగా నదిని స్తుతిస్తూ ఎన్నో గ్రంథాలు , శ్లోకాలు వెలవడ్డాయి. ఉత్తుంగ తరంగ అయిన గంగను స్తుతిస్తూ ఆది శంకరులు చేసిన గంగా స్తోత్రం అద్భుతం.

🌹🙏గంగా  పుష్కర స్నానం పవిత్రమైనది...🙏🌹

🌸పుష్కర స్నానం చేయడం వల్ల పాప హరణం అవుతుంది అని హిందువులకు అతి పెద్ద నమ్మకం. ఇప్పుడు ఎక్కడ కనిపించినా నాగ సాధువులు, అఘోరాలు ఈ పుష్కరాల్లో కనిపిస్తారు.

🌿పుష్కరుడు ఒక సంవత్సరం ఆ నదిలో పుష్కరాలు జరిగితే ఆ నదిలో ఉంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న గంగా పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పుష్కరకి అర్ధం 12 సంవత్సరాలు అని అర్థం. గంగా పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత వచ్చింది.

🌸గంగా పుష్కరం బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు ఏప్రిల్ 22న ప్రారంభం అవుతుంది, బృహస్పతి మీనంలో ప్రవేశించినప్పుడు మే 3, 2023న ముగుస్తుంది.

🌿బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన  మీనంలో ప్రవేశించినప్పుడు  గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది.

🌸 అయితే పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

🌿బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజూలలో గంగా నదిలో స్నానం చేయటం వలన

🌸సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని గంగా నదిలో అనేక మంది భక్తులు స్నానాలు చేస్తారు.

🌹పుష్కరుడు కథ:🌹

🌿పుష్కరుడు ఒక బ్రాహ్మణుడు. బ్రహ్మ దేవుడు పుష్కరుడు సృష్టికర్త. పుష్కరుడు మహా శివుడి కోసం తపస్సు చేశాడు అని పురాణాల్లో ఉంది. పుష్కరుని తీర్థ రాజు అని పిలుస్తారు.

హరే కృష్ణ గోవిందా 

No comments: