ఉన్కేశ్వర్ శివాలయం.. !!
🌿రామచంద్రమూర్తి వనవాస కాలంలో అనేకానేక అడవుల్లో పర్యటించారు. అందులో భాగంగానే ఉన్కేశ్వర్ సమీపంలో సీతాలక్ష్మణ సమేతంగా వన వాసము ఉండే సమయంలో .
🌸ఆ సమయంలోనే ఓ భక్తుడి వ్యాధుల్ని నయం చేసేందుకు ఆయనే ఈ క్షేత్రాన్ని సృష్టించారు...
🌿ఈ ఆలయంలోని శివుడూ విశేష మహిమాన్వితుడే.
అందుకే త్రేతాయుగం నుంచీ నేటి వరకూ ఈ చోటికి భక్తులు బారులు కడుతూనే ఉన్నారు. ఉన్కేశ్వర్
శివాలయం..
🌹స్థల పురాణం🌹
🌸వాల్మీకి రామాయణంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది.
పూర్వం శర్భంగుడు అనే ఋషి ఉన్కేశ్వర్ పరిసరాల్లోని దట్టమైన అడవుల్లో రామజపం చేస్తుండేవారు.
🌿 అతనికి చర్మవ్యాధులు సోకడంతో
తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయినా క్షణం విరామం లేకుండా రామనామాన్ని స్మరిస్తూనే ఉండడాన్ని శ్రీరామచంద్రుడు గ్రహించారు.
🌸అందుకే ఆయన వనవాస కాలంలో ఉన్కేశ్వర్ దండకారణ్యం లోకి వచ్చి శర్భంగుడ్ని కలవాలను కున్నారు. అయితే రాముడిని దర్శించుకోవడానికి శర్భంగుడు తన రూపాన్ని అడ్డంకిగా భావించారు.
🌿ఆ విషయాన్ని లక్ష్మణుడు పసిగట్టారు. ఈ విషయాన్ని రాముడికి వివరించారు... చలించిపోయిన రాముడు ఉన్కేశ్వర్‌వైపు రెండు బాణాలు సంధించారు.
🌸అందులో ఒకటి వ్యాధులను మటుమాయంచేసే సరోవర స్థాపనకూ, మరొకటి మహాశివ లింగ ప్రతిష్ఠాపనకూ కారణమయ్యాయి.
🌿అనంతరం శర్భంగ ఋషికి దర్శనమిచ్చిన శ్రీరామచంద్రుడు తొలుత వేడినీటి సరోవరంలో స్నానమాచరించి, మహా శివలింగాన్ని పూజించమని చెప్పారు.
🌸అలాచేసిన శర్భంగఋషి వ్యాధులన్నీ మటుమాయమయ్యాయి.
అనంతరం అటవీ పరిసరాల్లోని ఎందరికో ప్రకృతి వైద్యం అందజేసిన శర్భంగ ఋషి జీవసమాధి అయ్యారు.
🌿 ప్రస్తుత దేవాలయం ఆయన సమాధి దగ్గరే నిర్మించారు..
నాందేడ్ నుంచి 124 కిలోమీటర్లు, ఆదిలాబాద్ నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్లడానికి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి.
🌸ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఉదయంపూట నిరంతరం బస్సులూ, ఇతర వాహనాలూ తిరుగుతుంటాయి.
మాహోర్ వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సూ ఉన్కేశ్వర్ మీదుగా వెళ్తుంది. ..
🌿ఆలయ సమయాలు ..
ఉదయం 6 గంటలు నుండి రాత్రి 8 గంటలు వరకు..అక్కడ వసతి ఉండదు..చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి..వసతి బెస్ట్ మహుర్,అదిలాబాద్...స్వస్తీ.
No comments:
Post a Comment