Adsense

Monday, April 24, 2023

మంచి ప్రయత్నాలకు కొన్ని మంచి సూత్రాలు...!!

మంచి ప్రయత్నాలకు కొన్ని మంచి సూత్రాలు...!!


🌸నెమలి ఫించాన్ని తీసుకొని 21 రోజులు లక్మీ  మంత్రాన్ని చదివి పూజించి సింహద్వారం పై లేదా బీరువాలో పెట్టండి ,ధనం రావడం జరుగుతుంది ..

🌿 చిన్నపిల్లలు రాత్రిళ్ళు జడుసుకుంటుంటే తలగడ వైపు ఒక నిమ్మకాయ ఉంచండి,

🌸 పిల్లలు ప్రతీదానికి భయపడుతుంటే ఒక గోమతి చక్రాన్ని వెండి లాకెట్ చేయించి మెడలో వేయండి.

🌿 తరచూ గర్భస్రావం జరుగుతూ ఉంటే అనాథ పిల్లలకు మీకు తోచిన సహాయం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మీ జాతకరీత్యా లగ్నం నుండి ఐదవ స్థానంలో దోషముంటే దోషపరిహారము  చేయించండి.

🌷 గణపతి ప్రీతి కొరకు మీకు వీలయినపుడల్లా పిల్లలకు తీపి పదార్థాలు పంచండి

🌸 మీ బంగారం ఎప్పుడూ తాకట్టులో ఉంటుందా? అయితే పిసరంత బంగారాన్ని పుట్టలో వేసి పూజించండి.

🌿 కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని భైరవమంత్రం చదువుతూ మీ యింటికి ఎనిమిది పక్కలా చల్లండి, భైరవుడు మీకు రక్షణ గా ఉంటాడు.

🌸 కొద్దిగా పాతబెల్లం తీసుకొని ముద్దలా చేసి పదకొండు లవంగాలు గుచ్చి నైఋతిలో పాతి పెట్టండి.ఇంటికి పీడలు తొలగిపోతాయి.

🌿 శుక్ర వారం రాహుకాలంలో రెండు రొట్టెలు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. రాహుగ్రహ దోషాలనుండి విముక్తి లభిస్తుంది.

🌸 బ్యాంకు లో డబ్బులు వేసేముందు ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని జపించండి,

🌿 మీరు ఏరకమైన పొదుపు చేయాలనుకుంటే భరణీ నక్షత్రం లో చేయండి

🌸 ఆర్థికంగా అర్థం కాని స్థితి ఏర్పడినప్పుడు  సుందరాకాండ పారాయణం చేయండి,

🌿 శంఖపుష్పి  వేరుని గురుపుష్యమి రోజు తెచ్చి పూజించి శ్రీ సూక్తం చదివి మీరు డబ్బు లు పెట్టేచోట ఉంచండి,

🌸 మీరు చేసే ఏదైనా హోమంలో కమలా భీజాలు, నల్లనువ్వులు, ఇప్పనూనె, ఆవునెయ్యి వేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది...స్వస్తీ.

No comments: