Adsense

Saturday, April 1, 2023

కామద ఏకాదశి


చైత్ర శుద్ధ ఏకాదశిని కామిక ఏకాదశిగా పరిగణించబడుతోంది...దీనినే *సౌమ్య ఏకాదశి, కామద ఏకాదశి, దమన ఏకాదశి* అని కూడా అంటారు.
ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణుపూజ, ఉపవాసం, జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడింది...
పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని చెప్పబడింది,
స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు. 
అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా *'కామద ఏకాదశి వ్రతం'* కనిపిస్తుంది.
ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది.
ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి - పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.
ఉపవాసం ... జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.

ఓ గంధర్వుడు శాపం కారణంగా తన భార్యకు దూరమై, రాక్షసుడి రూపంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.
తన భర్తను ఆ స్థితి నుంచి బయటపడేయడం కోసం ఆ గంధర్వ స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది.
వ్రత ఫలితం వలన ఆ గంధర్వుడుకి శాప విమోచనం కలిగి తన భార్యను చేరుకుంటాడు.
భార్యా భర్తలు ఎలాంటి పరిస్థితుల్లోను విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉంది, అందుకే చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు, లక్ష్మీనారాయణుల ఆశీస్సులను పొందుతూ ఉంటారు.
**ఈరోజునే శ్రీకృష్ణునిని ఆందోళికోత్సవము జరుపుతారు.
ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి.**
కృష్ణ ప్రతిమగల ఉయ్యాలను ఊపితే, వేయి అపరాధాలైనా క్షమింపబడతాయి,
కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంత్యమునందు విష్ణు సాయుజ్యము లభించగలదు.

హరినామ స్మరణం - సర్వపాప హరణం

నీది కామదా ఏకాదశి ...
అనగా ఏంటి..? ఏం చేస్తే పాపాలు హరించవేయబడుతాయి..?



🌿మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటుచేసుకుని ఉంటుంది. అందులో చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని 'కామదా ఏకాదశి ' అని పిలుస్తుంటారు.

🌸ఇది పాపాలను హరిస్తుంది. వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలూ చెబుతున్నాయి.

🌸సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామాద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెబుతుంటారు.

🌸స్త్రీలు తమ సౌభాగ్యాన్నిసమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలో నైన , దేవాలయంనకు వెళ్లినప్పుడైన తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు.

🌿 తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు .. వ్రతాలు జరుపుతుంటారు.

🌸 అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా 'కామదా ఏకాదశి వ్రతం' ఒకటి. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది.

🌸ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.

🌸 ఉపవాసం ... జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.

🌸కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు.

🌸ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది.

🌸వరాహ పురాణం లో శ్రీ కృష్ణ పరమాత్ముడు యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం ,విశిష్టతను వివరించాడు .

🌸వశిష్ట మహాముని దిలీప్ రాజు కి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రోజు పరిపాలిస్తూ ఉండేవాడు.

🌿రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు, నాట్యాలు చేసిన రాజునూ సంతోషపరిచేవారు ఒకానొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు, తనభార్య లలితతో చాల అనోన్యంగా, ప్రేమగా ఉండేవాడు.

🌸 రాజ్యసభలో ఒకసారి అందరు కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచోనలోపడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరచిపోయి ,

🌿తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి నీ అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకు ఉన్న కళా అంత నాశనమైపోవాలి అని శపిస్తాడు.

🌸అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే బయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఖంతో భర్తను తీసుకోని అడవులోకి ప్రయాణమైంది .

🌿అల వింధ్యాచల అడువుల్లో ప్రయాణిస్తూ వుండగా శ్రింగి ఆశ్రమం ఒకటి కనపడుతుంది. అక్కడికి వెళ్ళిన లలిత శ్రింగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయును చెప్పి .. తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాదేయపడింది.

🌸అప్పుడు శ్రింగి మహర్షి కామాద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు, ఆ కధ మహాత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి, ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలచుకుంటూ ,

🌿స్వామి నేను భక్తి శ్రద్దలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భ ర్తను మీరే ఏ విధంగానైన కాపాడాలి అని మనసులో తలచుకోని నమస్కరించి తన ప్రక్కనే ఉన్న భర్త వైపు చూడగా

🌸 వింత ఆకారంలో ఉండే చూస్తేనే బయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు

🌿మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెబుతున్నాయి...

🌸ఏకాదశి రోజున స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు, లక్ష్మీనారాయణుల ఆశీస్సులను పొందుతూ ఉంటారు.

🌿ఈరోజునే శ్రీకృష్ణునిని ఆందోళికోత్సవము జరుపుతారు.
ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి.

కృష్ణ ప్రతిమగల ఉయ్యాలను ఊపితే, వేయి అపరాధాలైనా క్షమింపబడతాయి, 

కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంత్యమునందు విష్ణు సాయుజ్యము లభించగలదు...స్వస్తి..

No comments: