Adsense

Saturday, April 1, 2023

మహాభారత కాలంలో ఐదు మంది ఒకే సమయంలో జన్మించారు...

ఆధ్యాత్మికపరిజ్ఞానం అందరికీ అవసరం...!!





🌸1. భీముడు
2. దుర్యోధనుడు
3. కీచకుడు
4. జరాసంధుడు
5. హిడింబాసురుడు

🌿1. భీముడు...

🌸ప్రతిదీ శరీర బలానికి లోంగుతుంది అనుకోవడం అజ్ఞానం... అందుకే హనుమంతుని తోక ను తన శరీర బలంతో ఎత్తాలని అనుకుంటాడు..

🌿 కానీ ఎత్తలేక పోతాడు. కాబట్టి అన్ని సమస్యలు శరీర బలoతో సాధించలేము...చాలా సమస్యలు కేవలం బుద్ధి బలoతో సాధించవచ్చు...

🌸2..దుర్యోధనుడు....

💐మరీ స్వాభిమానం జాడ్యo వుండకూడదు... ప్రతి సందర్భంలోనూ తనను తాను ఎక్కువగా ఉన్నతంగా చూపించుకోవాలన్న

🌸అహంకారం దెబ్బతిన్న ప్రతి సారీ మరింత ద్వేష పూరితంగా తన మనస్సు కు తానే విషాన్ని నింపుకుంటూ మనశ్శాంతి లేకుండా జీవించాడు....

🌿3. కీచకుడు...

🌸స్రీ యొక్క ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా, ఇంకొకరి స్వేచ్ఛా స్వాతంత్రాలతో అక్కర్లేకుండానే వారిని అనుభవించాలని అనుకోవడం అవివేకం..

🌿ఆమెకు కూడా ఇష్టం వుంటే ఇక ఎలాగైనా ఊరేగవచ్చు... అది మీ ఇష్టం.. తానంటే ఇష్టం లేని స్రీ ని బలవంతంగా పొందాలని ఆశించి కష్టాలు కొని తెచ్చుకుంటాడు..

🌸4. జరాసంధుడు...

🌿ఇతన్ని ఎన్నిసార్లు పై నుండి కిందికి  చీల్చి రెండు ముక్కలుగా చేసి విసిరేసినా మళ్లీ  అతుక్కుని వస్తాడు...చాలా సమస్యలను ఎప్పుడూ కూడా వాటి వ్యతిరేక దిశలో ప్రయత్నించినప్పుడు అవి చాలా సులభంగా పరిష్కారం అవుతాయి..

🌸 అహంకారం అనేది జరాసంధుని చావు నుంచి నేర్చుకోవాలి... అతన్ని రెండుగా చీల్చి ఆ ముక్కలను వ్యతిరేక దిశలో విసిరేసినప్పుడు అవి ఇక అతుక్కోవు..

🌿5. హిడింబాసురుడు...

వాసనా దోషం పట్ల స్పృహ లేకపోతే చాలా కష్టాలు వస్తాయి.. మన ఇంద్రియ వాసనల పట్ల మనం చాలా అప్రమత్తతతో వుండాలి. లేకపోతే వాటి వాసనల దావలో పోయి కష్టాల పాలు అవుతాం...

పాండవులు అడవుల్లో వనవాసం చేస్తున్నప్పుడు తన ముక్కుకు నరవాసన తగుల్తుంది...ఎలాగైనా తినాలన్న వాసనకు లోనై మృత్యువు పాలవుతాడు.. 

No comments: