ప్రదోషం వ్రతం ఎలా చేయాలి
మహామహిమాన్వితమైన ప్రదోష స్తోత్రం...
ప్రదోషవేళ శివపూజ అత్యంత పుణ్యప్రదం.
ఈ సమయంలో శివనామస్మరణ అత్యంత్య శ్రేష్ఠం
* ప్రదోషవ్రతం*
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని కొందరు...
సూర్యాస్తమయ మయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.
ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
ప్రదోషమంటే అది ఒక కాల విశేషము.
ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము.
ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో, చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము.
అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే , అప్పుడు ప్రదోషము అంటారు.
కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది.
త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని ’మహాప్రదోషం’ అంటారు.
దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు.
సూర్యుడు అస్తమించే సమయం లో తిథి మారితే అది ప్రదోషకాలం.
ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది.
ఆ సమయంలో పార్వతి తో కలిసి పరమేశ్వరుడు అర్థనారీశ్వరునిగా అతిప్రసన్నుడై దర్శనమిస్తాడు.
శనివారం, త్రయోదశి , ప్రదోషం మూడూ కలిస్తే అవి శుభఘడియలుగా పరిగణించవచ్చు.
గ్రహపీడా నివారణకు, శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్న వారికి శనిప్రదోష సమయం దైవానుగ్రహ కాలంగా పరిగణిస్తారు.
ప్రదోషకాలం అంటే ఏమిటి, ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకోండి.
మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము.
వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము.
మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి.
ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.
ప్రదోషకాలం లో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది.
పరమశివుడు సదా ప్రదోషకాలంలో, హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు.
ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్టసంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాడు అనేది విదితం.
గజాసురుణ్ణి సంహారించేటప్పుడు , అంధకాసుర సంహారం లోను శివుడు చేసిన నృత్యం, భైరవరూపం లో మహా భయంకరంగా ఉంటుంది.
నిరాకారం లో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.
త్రయోదశి ఆదివారం వస్తే రవిప్రదోషం
త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమప్రదోషం
త్రయోదశి మంగళవారం వస్తే భౌమప్రదోషం
త్రయోదశి బుధవారం వస్తే బుధప్రదోషం
త్రయోదశి గురువారం వస్తే గురుప్రదోషం
త్రయోదశి శుక్రవారం వస్తే శుక్రప్రదోషం
త్రయోదశి శనివారం వస్తే దాన్ని శనిత్రయోదశి, శనిప్రదోషమని పిలుస్తారు.
అన్ని త్రయోదశుల లోనూ శివపూజ తప్పనిసరి.
*ప్రదోష వ్రతం ఆచరించే విధానం*
ప్రదోష సమయం రోజూ వస్తున్నా,
త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.
ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి,
శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది.
త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు.
ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష , కృష్ణపక్ష త్రయోదశులు)
త్రయోదశి వ్రతం చేయాలి.
శుక్లపక్ష సోమవారం నాడు,
లేదా బహుళపక్ష శనివారం నాడు
త్రయోదశి కలసి వచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే, ఫలితం మరీ విశేషంగా ఉంటుంది.
ప్రదోషకాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు, నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం.
శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును.
శని కర్మకారకుడు ,
శివుడు సంహారకారకుడు
కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.
వ్రతం ఆచరించే వారు త్రయోదశి నాడు ఉదయాన స్నానమాచరించి, శివుని పూజించి శివనామ స్మరణతో సూర్యాస్తమయం వరకు గడపాలి.
ఉపవాసం చేయలేని వారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు,
అంటే పాలు , పండ్లు వంటివి తిని గడపవచ్చు.
సాయంత్రం పూజ జరిపిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు.
అయితే త్రయోదశి నాడు వండని అంటే ఉడికించని పదార్థాలను స్వీకరించి,
మరుసటి రోజు వండిన ఆహారం భుజించాలి.
అంటే వ్రతం నాడు పక్వపదార్థాలు నిషేధం అని చెబుతారు.
సూర్యాస్తమయానికి ఒకటిన్నర గంటల మునుపు ప్రారంభమయ్యే ప్రదోషకాలం,
సూర్యాస్తమయం తర్వాత ఒక గంట వరకూ ఉంటుంది.
ఈ సమయం లోనే ప్రదోష వ్రతం నిర్వహించాలి.
అంటే రెండున్నర గంటల పాటు పూజ జరుగుతుంది.
ప్రదోషం సందర్భం గా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి, ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
సాయంత్రం ఈ పూజ జరుగుతుంది.
ఏ వయసు వారైనా , స్త్రీపురుష భేదం లేకుండా ప్రదోషవ్రతం ఆచరింపవచ్చు.
స్కందపురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని రెండు విధాలుగా ఆచరింపవచ్చు.
*మొదటిది రాత్రి*, పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయడం.
*రెండవ విధానం* సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం.
సాయింత్రం శివపూజ జరిపిన తర్వాత ప్రసాదం స్వీకరించి వ్రతం పూర్తిచేయడం.
నిర్వహించే వారి ఓపిక , సానుకూలత ప్రకారం వ్రతం జరపవచ్చు.
ముందుగా గణేషుని పూజించి, తరువాత శివపార్వతులతో పాటు సుబ్రమణ్యస్వామి , నంది కూడా పూజ చేస్తారు.
శివలింగానికి పాలు, పెరుగు మొదలుగు ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు.
తరువాత బిల్వదళాలతో పూజ చేస్తారు.
ప్రదోష కాలంలో బిల్వదళాలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి అని భక్తులు నమ్ముతారు.
తరువాత ప్రదోష వ్రత కథ , శివ పురాణం శ్రవణం చేస్తారు.
*మహా మృత్యుంజయ మంత్రం 108 సార్లు పఠిస్తారు*
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
పూజ ముగించిన తరువాత శివాలయానికి వెళతారు.
ప్రదోషం రోజు శివాలయం లో ఒక దీపం వెలిగించినా, అనేక రెట్ల ఫలితం ఉంటుంది అని భావిస్తారు.
స్కంద పురాణం ప్రకారం
ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికిీ అన్ని కోరికలు నెరవేరుతాయి.
అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యం తో పాటు మహా శివుడు మంచి ఆనందకర జీవితం ప్రసాదిస్తాడు.
*ప్రదోష వ్రత ఫలితాలు*
ప్రదోషం వ్రతం వల్ల కుటుంబం లోని ఇబ్బందులు తొలగిపోతాయి.
అపవాదులు దూరమవుతాయి.
వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరుగుతుంది.
సంతాన సాఫల్యం కలుగుతుంది.
చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది.
*సోమ ప్రదోషం*
సోమవారము శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజున వచ్చే సోమప్రదోషము ను ప్రశస్తమైనదిగా భావిస్తారు. ఈ రోజున ప్రదోష వ్రతము ఆచరించటం వలన మనసు లోని మలినాలన్నీ తొలగిపోతాయి.
*శని ప్రదోషం*
దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు వెలువడిన హాలాహలం నుండి, శివుడు ప్రపంచాన్ని రక్షించిన రోజుగా శనిప్రదోషం రోజును చెబుతారు.
శని కర్మకారకుడు, శివుడు సంహారకారకుడు, కావున శని ప్రదోషసమయాన శివారాధన చేయడం ఉత్తమంగా పరిగణిస్తారు.
శని ప్రదోషవ్రతం ఆచరించటం వలన..
కర్మదోషాలు,
జాతకదోషాల నుండి విముక్తి పొందవచ్చునని చెబుతారు.
వివాహ దోషాలు,
సంతానలేమి,
ఆర్థిక ఇబ్బందులు
ఉన్నవారు ఈ రోజున ప్రదోషకాలంలో శివారాధన చేయాలి.
గత జన్మల పాపాలు కూడా తొలగి సకలసంపదలు చేకూరుతాయి.
శని ప్రదోషానికి సంబంధించి ఉజ్జయిని మహాకాళేశ్వరునికి సంబంధించిన కథ ఒకటి చెప్పబడినది.
*గురు ప్రదోషం*
త్రయోదశీ ప్రదోషము గురువారము వస్తే ఆ రోజును గురుత్రయోదశి గా భావిస్తారు.
గురు ప్రదోషపూజ వలన విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయని చెబుతారు.
జాతకము లో ఉండే గురు దోషములకు రుద్రారాధన విరుగుడు గా భావిస్తారు.
*శివ ప్రదోష స్తోత్రము*
కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
|
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే।।
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ।
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే।।
వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః।
తాలో న్నిద్రకరో , రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా।।
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా।
సేవంతే తమనుప్రదోష సమయేదేవంమృడానీపతిమ్।।
గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య।
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ।।
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః।
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః।।
ఇతి శ్రీ శివ ప్రదోష స్తోత్రం సంపూర్ణం.

No comments:
Post a Comment