🌿"పరశురామ క్షేత్రమనగానే
మనకు ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే కేరళ ప్రాంతమే జ్ఞాపకం వస్తుంది.
🌸అలాగే అవతార పురుషుడైన పరశురాముడు పుట్టిన
ఊరు కూడా అత్యంత ప్రసిద్ధి చెందినది.
🌿పరశు రామ్ అనే ఆ భూమి ఎంతో
మహిమాన్వితం.
పవిత్రమైన భరత భూమికే అలంకారాలైనవి యిక్కడి నదీనదాలు,
సముద్రములు, పర్వతాలు , లోయలు , అడవులు.
🌸మహారాష్ట్ర మాత నెన్నుదుటి తిలకం
చిప్లూన్ తాలూకాలోని
పరశురామ్ అనే పుణ్యస్ధలం.
🌿పశ్చిమానున్న నాసిక్ నుండి కొచ్చిన్ దాకా వున్న పడమటి కొండలను
మహారాష్ట్ర లో సహ్యాద్రి
కొండలుగా పిలుస్తారు.
🌸పూనేలో సతారా అనే ప్రదేశమును దాటేక పర్వతశ్రేణులు ఆరంభమౌతాయి. పూనే నుండి సుమారు 250 కి.మీ దూరంలో రత్నగిరి జిల్లాలో చిప్లూన్ తాలూకా వున్న ఈ ప్రదేశం ఒక సుందరమైన లోయ .
🌿ఆ లోయలో ఒక కొండ గ్రామం పరశురామ్. చిప్లూన్ నుండి
12 కి.మీ. దూరం కొండ మీదకి వెడితే , రమణీయ ప్రకృతితో నిండి వున్న యీ గ్రామాన్ని దర్శించవచ్చును.
🌸 ఈ కొండలలో అనేక
వర్ణాలు కనువిందు కలిగిస్తాయి.
ఇక్కడ వున్న రాతిబండలు
ఎఱుపు రంగు కలిగి వుంటాయి. ఆలయాలు,
ఇళ్ళు కూడా యీ బండలతో
నిర్మించబడినవే.
🌿సహ్యాద్రి కొండలమీద నుండి చిప్లూన్ మార్గం అంతా కూడా మామిడి వంటి ఫలవృక్షాలతో దట్టంగా పెరిగి ఎటువైపు చూసినా ప్రకృతి అంతా పచ్చగా ఆహ్లాదం కలిగిస్తుంది.
🌸ఎఱ్ఱని షవురీ పుష్పాలతోపాటు పలురకాల పరిమళ పుష్పాల సౌరభాలతో నిండి వుంటుంది
ఆ మార్గంలో వశిష్టా నది
అందాలతో వంపులుతిరిగి ప్రవహిస్తున్నది.
🌿అక్కడ అక్కడ కోతులు ఒక చెట్టునుండి
మరొక చెట్టుకి దూకుతూ
వుండడం, పక్షుల కలకలారావాలతో నిండివుండడం , మనోహరమైన ఆ ప్రదేశం వీక్షించగలము.
🌸ప్రధమంగా శ్రీమహావిష్ణువు అంశయైన
పరశురాముడు స్వయం భూమూర్తి గా అక్కడ అవతరించాడు. తరువాత ఆయనకు పూజా పునస్కారాలు ప్రారంభమై క్రమేపీ జన వాసాలు ఏర్పడ్డాయి.
🌿మెల్లగా ఒక గ్రామం నిర్మించబడినది. నాలుగు తరాలుగా ఆ ఆలయ
కైంకర్యం చేస్తూ వస్తూన్న
కొంకణదేశ బ్రాహ్మణ కుటుంబాలు ;
ఇతరులు అక్కడ నివసిస్తున్నారు.
🌸ఈ పరశురామ ఆలయాన్ని బ్రహ్మేంద్ర స్వామి నిర్మించినట్లు తెలుస్తున్నది.
భూలోకంలోని రాజులందరూ
కలహించుకుంటూ శాంతి భధ్రతలు పూర్తిగా క్షీణదశకు వచ్చినప్పుడు
🌿భూదేవి ఆ అశాంతిని సహించ లేక శ్రీమహావిష్ణువు తో
మొర పెట్టుకోగా, మహావిష్ణువు తన ఆరవ అవతారం గా పరశురామునిగా
యీ భూలోకాన జన్మించాడు.
🌸జమదగ్ని మహర్షికి రేణుకాదేవి అనే భార్య నలుగురు పుత్రులు వున్నారు. కుటుంబభారం కారణంగా జమదగ్నికి
పేదరికం అనుభవించవలసివచ్చింది.
🌿 భార్యా పిల్లలు ఆకలితో బాధ పడ్డారు.
అప్పుడు జమదగ్ని బ్రహ్మను ధ్యానించగా బ్రహ్మ ప్రత్యక్ష మై 'కావలసిన వరం కోరుకొనమనగా'
జమదగ్ని తన బీదరికాన్ని
తొలగించమని కోరుకున్నాడు.
🌸బ్రహ్మదేవుడు జమదగ్నికి కామధేనువును
ఇచ్చాడు. జమదగ్ని ని చూసి " నీకు ఐదవ పుత్రుడిగా శ్రీమహావిష్ణువు అవతరించబోతున్నట్లు తెలిపాడు. కొన్నాళ్ళకు రేణుకాదేవి అందమైన బాలునికి జన్మనిచ్చింది.
🌿ఆ బాలునికి 'రామా' అని
నామకరణం చేశారు. ఆ
రాముడు పెరిగి పెద్ద వాడై
సకల విద్యాపారంగతుడై
అత్యంత పరాక్రమవంతుడైనాడు.
🌸రాముడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్ష మై" ఎందుకు యింత కఠోర
తపస్సు చేస్తున్నావని "
అడిగాడు. ఈ లోకంలో
పాలకులైన క్షత్రియులంతా దుష్టులై , దుర్మార్గులై లోకకంటకులై వున్నారు.
🌿వారిని ఎదుర్కొని శాంతి కలిగే మార్గాన్ని సూచించమని ప్రార్ధించాడు .
పరమేశ్వరుడు 'పరశువు' అనే దైవీక శక్తి కలిగిన గొడ్డలిని ప్రసాదించి దుష్ట సంహారం చేయమని ఆదేశించాడు.
🌸పరశువును పొందిన రాముడు ఆనాటి
నుండి పరశురామునిగా
ప్రసిధ్ది చెందాడు. పరశురాముని దశావతారాలలో ఆరవ అవతారంగా చెప్తారు.
🌿ఈ పరశురాముడు త్రేతాయుగ గాధయైన రామాయణంలో , ద్వాపరయుగం నాటి మహాభారత గాధలోనూ దర్శనమిస్తాడు.
🌸ఈ పరశురాముని ఆలయం
ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినదిగా చెప్తారు. పరశురాముని మూర్తి స్వయంభూగా
వెలసినందున స్వయంభూమూర్తికే పూజలు చేసే వారు.
🌿ఈనాడు పరశురామునికి
ఒక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు.
🌸ఆలయ ప్రాంగణమంతా దట్టమైన పచ్చని చెట్లతో , ప్రశాంతంగా వుంటుంది. కొండ మీద వున్న యీ ఆలయానికి సుమారు 50 మెట్లు ఎక్కి మీదకు వెళ్ళాలి.
🌿గర్భగుడి లో పరశురాముడు
నాలుగు హస్తాలతో దర్శనమిస్తాడు.
కుడివైపు చేతిలో
గొడ్డలి , మరొకటి అభయ హస్తం , ఎడమ వైపు ఒక చేతిలో బాణం, మరొక చేతిలో కమండలం తో దర్శనం అనుగ్రహిస్తున్నాడు.
🌸పరశురాముడు చిరంజీవి.
కాముని గెలిచిన బ్రహ్మచారి
పరశురాముడు కుడి ప్రక్కన
మన్మధుని శిల, కాలుని పై విజయం సాధించి చిరంజీవియైన పరశురాముని ఎడమ ప్రక్కన కాలుని శిలా ప్రతిమలు
వున్నాయి.
🌿పరశు రాముని తల్లి రేణుకాదేవికి గర్భగుడి వెనుక ఒక
ప్రత్యేక సన్నిధి వున్నది.
రేణుకాదేవి సన్నిధికి కుడి
ప్రక్కన పైన హోమ మండపం ఎడమ ప్రక్కన బాణ గంగా పుష్కరిణి వున్నాయి.
🌸పరశురాముడు
ఐదు బాణాలు వేయగా
భూగర్భం నుండి గంగా జలం పైకి వచ్చి పుష్కరిణి గా మారిందని చెప్తారు.
🌿రాముడు ప్రజల సౌకర్యార్ధం అతి విశాలమైన అరవై మంచినీటి సలస్సులను , అరవై అతి పెద్ద సుందర ఉద్యానవనాలను నిర్మించినట్లు పురాణ కధనం.
🌸రేణుకాదేవి సన్నిధినుండి కుడి ప్రక్క కొన్ని మెట్లు ఎక్కి పైకి వెడితే , హోమాలు చేయడానికి ప్రత్యేక మండపం వస్తుంది.
🌿సూర్యోదయ, సూర్యాస్తమయ
సమయాలలో హోమం చేస్తే గృహాలకి శాంతి చేకూరుతుందని ,
దేహానికి ఆరోగ్యం సమకూరుతుందని
చెప్తారు.
🌸పరశురామ భూమిలో ,అక్షయ తృతీయనాడు పరశురామ జయంతి
వైభవంగా జరుపుతారు.
ఈ ఉత్సవాలు మూడు రోజులు జరుగుతాయి.ఈ ఉత్సవాలకు చిప్లూన్ ప్రాంత ప్రజలేకాక
🌿చుట్టు ప్రక్కల గ్రామస్థులు , ప్రధాన నగరాలైన పూనే, ముంబయి , గోవాల నుండి కూడా వేలొది యాత్రీకులు
వెళ్ళి పాల్గొంటారు.
🌸ఛత్రపతి శివాజీ మహరాజ్ ఈ ఊరుకు
వచ్చి, పరశురాముని
పూజించినట్టు చరిత్ర చెప్తోంది.
🌿చిప్లూన్ దాకా రైలు , బస్సుల
వసతి వుంది. చిప్లూన్
నుండి పరశురామ్ గ్రామానికి వెళ్ళడానికి కారు, ఆటో వసతులు
వున్నాయి.
🌸ప్రకృతి అందాలతో నిండిన యీ సుక్షేత్రం పర్యాటకులకు , విహారయాత్రీకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
దైవీక వాతావరణం మనసులకి
ఆనందాన్ని తృప్తిని కలిగిస్తుంది.
ప్రత్యేక సన్నిధి వున్నది.
రేణుకాదేవి సన్నిధికి కుడి
ప్రక్కన పైన హోమ మండపం ఎడమ ప్రక్కన బాణ గంగా పుష్కరిణి వున్నాయి.
🌸పరశురాముడు
ఐదు బాణాలు వేయగా
భూగర్భం నుండి గంగా జలం పైకి వచ్చి పుష్కరిణి గా మారిందని చెప్తారు.
🌿రాముడు ప్రజల సౌకర్యార్ధం అతి విశాలమైన అరవై మంచినీటి సలస్సులను , అరవై అతి పెద్ద సుందర ఉద్యానవనాలను నిర్మించినట్లు పురాణ కధనం.
🌸రేణుకాదేవి సన్నిధినుండి కుడి ప్రక్క కొన్ని మెట్లు ఎక్కి పైకి వెడితే , హోమాలు చేయడానికి ప్రత్యేక మండపం వస్తుంది.
🌿సూర్యోదయ, సూర్యాస్తమయ
సమయాలలో హోమం చేస్తే గృహాలకి శాంతి చేకూరుతుందని ,
దేహానికి ఆరోగ్యం సమకూరుతుందని
చెప్తారు.
🌸పరశురామ భూమిలో ,అక్షయ తృతీయనాడు పరశురామ జయంతి
వైభవంగా జరుపుతారు.
ఈ ఉత్సవాలు మూడు రోజులు జరుగుతాయి.ఈ ఉత్సవాలకు చిప్లూన్ ప్రాంత ప్రజలేకాక
🌿చుట్టు ప్రక్కల గ్రామస్థులు , ప్రధాన నగరాలైన పూనే, ముంబయి , గోవాల నుండి కూడా వేలొది యాత్రీకులు
వెళ్ళి పాల్గొంటారు.
🌸ఛత్రపతి శివాజీ మహరాజ్ ఈ ఊరుకు
వచ్చి, పరశురాముని
పూజించినట్టు చరిత్ర చెప్తోంది.
🌿చిప్లూన్ దాకా రైలు , బస్సుల
వసతి వుంది. చిప్లూన్
నుండి పరశురామ్ గ్రామానికి వెళ్ళడానికి కారు, ఆటో వసతులు
వున్నాయి.
🌸ప్రకృతి అందాలతో నిండిన యీ సుక్షేత్రం పర్యాటకులకు , విహారయాత్రీకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
దైవీక వాతావరణం మనసులకి
ఆనందాన్ని తృప్తిని కలిగిస్తుంది.
No comments:
Post a Comment