Adsense

Friday, April 7, 2023

వరంగల్ జిల్లా : పెరుమాండ్ల సంకీ శ్రీ రామాలయం




💠 వాయుపుత్రుడైన హనుమంతుడు.. ఎంతటి పరాక్రమవంతుడో అంతటి సున్నితమైన మనసున్నవాడు.
మనస్ఫూర్తిగా ఆయనని అర్ధించాలే గాని, ఆదుకోవడానికి ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయడు.
భక్తి కొలది ఆయన అనుగ్రహం వుంటుంది కనుకనే, స్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తూ వుంటాయి.
అలా హనుమ తమ మహిమలను చూపే క్షేత్రంగా 'పెరుమాండ్ల సంకీస' కనిపిస్తుంది.

💠 సీతారామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు గర్భాలయంలో కొలువై వుండటం ఇక్కడి విశేషం.
గర్భాలయానికి ఎదురుగా గల ప్రత్యేకమందిరంలో హనుమంతుడు దర్శనమిస్తుంటాడు.

💠 వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పరిధిలో ఈ గ్రామం వుంది. ఇక్కడి రామాలయం వెయ్యి సంవత్సరాలకి ముందు నుంచి వుంది. శ్రీరాముడు ఇష్టపడి కొలువైన క్షేత్రమిదంటున్నారు.


💠 పూర్వం ఇక్కడ చిన్న గోపాల స్వామి ఆలయం వుండేదట, అప్పటి గ్రామ దొర అయిన వీరస్వామి అనే అతడు, గోపాల స్వామి మూర్తి స్థానంలో శ్రీతిరుపతి వెంకటేశ్వర స్వామి మూర్తిని ప్రతిస్థించాలని తిరుమలలోని పనివారికి విగ్రహాన్ని చేసే పని అప్పటించారట, అయితే మూలవిరాట్టుని మలచడానికి శిల్పులు ప్రయత్నించిన ప్రతిసారి శ్రీ రాముడి రూపమే ఆవిష్కృతమైందట.
దాంతో అది స్వామివారి మహిమగా భావించి అతను విగ్రహాన్నే ప్రతిష్ఠించారు.

💠 సాధారణంగా గర్భాలయాలలో సీతారాములు లక్ష్మణ హనుమంతులు మాత్రమే దర్శన మిస్తుంటారు. కానీ ఇక్కడి గర్భాలయంలో సీతారాములు లక్ష్మణ భరత శత్రుఘ్నులు కొలువుదీరి వుండటం విశేషం. గర్భాలయం ఎదురుగా హనుమంతుడు దర్శనమిస్తుంటాడు.

💠 హనుమ తమ మహిమలను చూపే క్షేత్రంగా 'పెరుమాండ్ల సంకీస' కనిపిస్తుంది.
ఇక్కడి రామాలయం వెయ్యి సంవత్సరాలకి ముందు నుంచి ఉంది.

💠 శతాబ్దాల చరిత్ర గల ఇక్కడి ఆలయ వైభవానికి రాజగోపురం అద్దం పడుతూ వుంటుంది.
విశాలమైన ప్రాంగణం ఓ వైపున నైవేద్యాలను తయారుచేసే 'తిరువంటపడి' మరో వైపున కల్యాణోత్సవం జరిపే మంటపం కనిపిస్తాయి. అక్కడి నుంచి లోపలికి వెళితే వేణుగోపాలస్వామి మందిరం ఆండాళ్ మందిరం ఆళ్వారుల మందిరం దర్శనమిస్తాయి.
ఆ పక్కనే గల అద్దాల మంటపంలో, ఉత్సవాల సమయంలో స్వామివారికి పవళింపు సేవను నిర్వహిస్తుంటారు.

💠 ఇక్కడి శ్రీరాముడు సౌందర్య మూర్తి.
ఈ అందం అటు మూలమూర్తిలోను ఇటు ఉత్సవ మూర్తిలోను తొణికిసలాడుతుండటం విశేషం.
ఈ కారణంగానే వైభవంలో భద్రాద్రి రాముడు ... చక్కదనంలో సంకీస రాముడు అని భక్తులు చెప్పుకుంటూ వుంటారు.
భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడ శ్రీ రామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుగుతాయి.

💠 డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామంలో ప్రజలకు సిరిసంపదలను ప్రసాదించే శివుడు కూడా కొలువై ఉన్నాడు. శివుడు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. శివుడు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించినా ప్రతి పుణ్యక్షేత్రానికి ఏదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది. ఈ క్షేత్రంలో శివుడిని దర్శించుకుంటే సంపదలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని సమాచారం.

No comments: