THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Friday, April 7, 2023
శుభప్రదం స్వస్తిక్ చిహ్నం.
ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తుంటారు.
🌾దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది. స్వస్తిక్ అంటే శుభం జరగటం.
🌾విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది.
🌾విఘ్నహర్త అయిన గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుకనూ, దీన్ని శుభప్రదంగా భావిస్తారు.
🌾ఈ స్వస్తిక్ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు.
🌾అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట.
🌾దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు.
🌾తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలనిట. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్ గీస్తారు.
🌾ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది.
🌾వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment